విద్యార్థుల సంఖ్యను పెంచుదాం | Sakshi
Sakshi News home page

విద్యార్థుల సంఖ్యను పెంచుదాం

Published Sun, Nov 19 2023 12:10 AM

గుడ్లూరు: నరసాపురం ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేస్తున్న ప్రవీణ్‌ప్రకాష్‌   - Sakshi

గుడ్లూరు: మనబడి నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దుతున్న నేపథ్యంలో సర్కారు బడుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచాలని రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ప్రకాష్‌ సూచించారు. గుడ్లూరు మండలంలోని నరసాపురం ప్రాథమిక పాఠశాలను ప్రవీణ్‌ప్రకాష్‌ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని రికార్డులు, రిజిస్టర్లు పరిశీలించారు. పలు పాఠ్యాంశాలపై ప్రశ్నించగా విద్యార్థులు కొన్నింటికి సమాధానాలు చెప్పకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంపై కూడా ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 29 మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండి కూడా పాఠ్యాంశాలను సక్రమంగా బోధించకపోతే ఎలా అని ప్రశ్నించారు. తీసుకునే జీతాలకు న్యాయం చేయకపోతే ఎలా అని మండిపడ్డారు. ఉపాధ్యాయులు శ్రద్ధ వహించి విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ఆయన వెంట ట్రెయినీ కలెక్టర్‌ సంజనాసిన్హా, ఆర్జేడీ సుబ్బారావు, డీఈఓ గంగాభవాని, సబ్‌ కలెక్టర్‌ శోభిక, డిప్యూటీ ఈఓ శ్రీనివాసులు, ఎంఈఓలు శ్రీనివాసులు, గంగాధర్‌, పలువురు ఉన్నతాధికారులు ఉన్నారు.

Advertisement
Advertisement