పేదల అభ్యున్నతే సీఎం లక్ష్యం | Sakshi
Sakshi News home page

పేదల అభ్యున్నతే సీఎం లక్ష్యం

Published Fri, Nov 24 2023 12:22 AM

- - Sakshi

నెల్లూరు (దర్గామిట్ట): బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి నిరంతరం పాటుపడే ఏకై క వ్యక్తి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అని జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ కొనియాడారు. వైఎస్సార్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకంలో భాగంగా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో నగదును జమ చేసే కార్యక్రమాన్ని తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సీఎం గురువారం ప్రారంభించారు. కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో లబ్ధిదారులకు నమూనా చెక్కును కలెక్టర్‌ హరినారాయణన్‌, జెడ్పీ చైర్‌పర్సన్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఆర్థిక స్తోమత లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికులు తమ పిల్లల వివాహాలను గౌరవప్రదంగా చేయాలనే ఉద్దేశంతో వైఎస్సార్‌ కల్యాణమస్తు, షాదీ తోఫా పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. నాలుగో విడతగా జిల్లాలోని 486 మందికి రూ.3.87 కోట్లను వారి బ్యాంక్‌ ఖాతాల్లో జమ చేశారని వెల్లడించారు. డీఆర్డీఏ పీడీ సాంబశివారెడ్డి, జిల్లా బీసీ సంక్షేమాధికారి వెంకటయ్య, జిల్లా సాంఘిక సంక్షేమాధికారి రమేష్‌, ఐటీడీఏ పీఓ మందా రాణి పాల్గొన్నారు.

మాలాంటి పేదలకు వరం

ఆగస్ట్‌ 30న మాకు వివాహమైంది. వలంటీర్‌, సచివాలయ సిబ్బంది ద్వారా వైఎస్సార్‌ కల్యాణమస్తు పథకానికి దరఖాస్తు చేసుకున్నాం. ఈ నిధులు మంజూరయ్యాయని తెలిసి చాలా సంతోషపడ్డాం. రూ.50 వేల ఆర్థిక సాయాన్ని అందించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మాలాంటి పేదలకు సాయం చేస్తున్న జగనన్నకు రుణపడి ఉంటాం.

– అన్నాబత్తిన సాయిభరత్‌, ఉమా,

విలుకానుపల్లి, పొదలకూరు

పేదోళ్ల ఇంటి బిడ్డ జగనన్న

మాలాంటి పేదోళ్లకు ప్రభుత్వం అండగా ఉంటోంది. పేదింటి ఆడపిల్లల వివాహాలు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. పేదరికం నుంచి బయటపడి సమాజంలో గౌరవప్రదంగా బతకగలమనే ఆశ కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు.

– సాదిక్‌ అలీ, యాస్మిన్‌, నెల్లూరు

జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ

వైఎస్సార్‌ కల్యాణమస్తు,

షాదీ తోఫా నిధుల విడుదల

జిల్లాలో 486 మందికి

రూ.3.87 కోట్ల లబ్ధి

1/2

2/2

Advertisement
Advertisement