పవర్‌ కాదు.. ప్రజాసేవ ముఖ్యం | Sakshi
Sakshi News home page

పవర్‌ కాదు.. ప్రజాసేవ ముఖ్యం

Published Wed, Nov 29 2023 12:18 AM

- - Sakshi

నెల్లూరు(పొగతోట): జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘ సమావేశాల్లో జెడ్పీటీసీ సభ్యులు పవరుంటే ప్రజలకు అన్నీ చేయవచ్చని మాట్లాడారు. దీనికి జెడ్పీ చైర్‌పర్సన్‌ స్పందిస్తూ ప్రజలకు సేవ చేయడానికి పవర్‌ అవసరం లేదని, పనిచేస్తే చిరకాలం ప్రజలు గుర్తుంచుకుంటారని అన్నారు. మంగళవారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జెడ్పీ సీఈఓ బి.చిరంజీవి ఆధ్వర్యంలో స్థాయీ సంఘ సమావేశాలు నిర్వహించారు. చైర్‌పర్సన్‌ అరుణమ్మ మాట్లాడుతూ జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో నిలిపేందుకు అధికారులందరూ సమన్వ యంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. అర్హులైన లబ్ధిదారులందరికీ సంక్షేమ ఫలాలు అందించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. పదవ తరతి విద్యార్థుల ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు దోహదపడే విజయదీపిక బుక్స్‌ను అందిస్తున్నామన్నారు. తెలుగు, ఆంగ్లంలో ముద్రించిన పుస్తకాలను పదవ తరగతి విద్యార్థులకు త్వరితగతిన అందించేలా విద్యాశాఖాధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ములుముడి –తాటిపర్తి ఆర్‌అండ్‌బీ రోడ్డుకు కాంట్రాక్టర్‌ అగ్రిమెంట్‌ ప్రక్రియను పూర్తిచేసి రోడ్డు పనులు చేసేలా ఆర్‌అండ్‌బీ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నెల్లూరు–కనుపూరు కాలువకు ఈనెలలోనే సాగునీటిని విడుదల చేసేలా ఇరిగేషన్‌ అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. జెడ్పీటీసీ సభ్యులు సూచించిన సమస్యలను త్వరిత గతిన పరిష్కరించేలా అధికారులు చర్యలు తీసుకో వాలన్నారు. ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు ఇవ్వడం విషయంపై డీఈఓ గంగాభవానీతో చర్చించారు. షోకాజ్‌ నోటీసుల విషయంలో ఉపాధ్యాయు లు ఎటువంటి ఇబ్బందులు లేకుండా వివరణతో సరిపెట్టాలన్నారు. పంచాయతీ రాజ్‌, ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్‌, డీఆర్‌డీఏ, డ్వామా, వ్యవసాయ శాఖ, హార్టికల్చర్‌, ఐసీడీఎస్‌, ఐటీడీఏ, సివిల్‌ సప్‌లై తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. రూ.250.76 కోట్లతో 659 గ్రామ సచివాలయ భవ నాలు నిర్మాణాలు చేపట్టగా ఇప్పటి వరకు 334 భవన నిర్మాణాలు పూర్తి అయ్యాయని అధికారులు వివరించారు. రూ.143 కోట్లతో 656 రైతు భరోసా కేంద్రాల నిర్మాణాలు చేపట్టగా 238 ఆర్‌బీకేలు పూర్తి అయ్యాయని తెలిపారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, జెడ్పీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

జెడ్పీ చైర్‌పర్సన్‌ ఆనం అరుణమ్మ

పనులు వేగవంతం చేయాలని

అధికారులకు ఆదేశం

Advertisement

తప్పక చదవండి

Advertisement