నేటి నుంచి ఎన్నికల ప్రచారం | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ఎన్నికల ప్రచారం

Published Mon, Apr 8 2024 12:15 AM

- - Sakshi

కోవూరు: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేణుంబాక విజయసాయిరెడ్డి, కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి నియోజకవర్గ పరిధిలో సోమవారం నుంచి ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు. తొలిరోజు విడవలూరు మండలంలోని విడవలూరులో బహిరంగ సభ, 10న బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని జొన్నవాడలో, 12న కోవూరు మండలం మోడేగుంటలో, 13న ఇందుకూరుపేట మండలంలోని కుడితిపాళెంలో, 14న కొడవలూరు మండలం యల్లాయపాళెంలో, 15న విడవలూరు మండలం వావిళ్లలో, 16న కొడవలూరు మండలం కమ్మపాళెంలో, 18న బుచ్చిరెడ్డిపాళెం మండలంలోని పెనుబల్లి ప్రాంతాల్లో ప్రచార సభలు జరుగుతాయి. వీటిని వైఎస్సార్‌సీపీ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని ప్రసన్నకుమార్‌రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో కోరారు.

రేపు పెంచలకోనలో ఉగాది వేడుకలు

రాపూరు: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పెంచలకోనలో మంగళవారం ఉగాది వేడుకలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 4 గంటలకు అభిషేకం, 5 గంటలకు పూలంగి సేవ, 9 గంటలకు బంగారు గరుడ వాహనంపై క్షేత్రోత్సవం, 11 గంటలకు పంచాంగ శ్రావణం, కల్యాణం నిర్వహించనున్నట్లు తెలియజేశారు. సాయంత్రం 6 గంటలకు గోనుపల్లిలోని పెనుశిల నరసింహస్వామి ఆలయంలో ఉగాది ఉత్సవం జరుగుతుందన్నారు.

రేషన్‌ బియ్యం పట్టివేత

సోమశిల: అనంతసాగరం మండల పరిధిలోని పాతదేవరాయపల్లి ఎస్సీ కాలనీలో శనివారం అర్ధరాత్రి అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని రెవెన్యూ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వారి కథనం మేరకు.. రేషన్‌ బియ్యం తరలింపుపై సమాచారం అందడంతో అనంతసాగరం డీటీ గిరీష్‌ ఆ కాలనీకి చేరుకుని పరిశీలించారు. బొలెరో ట్రక్కులో 1.5 టన్నుల రేషన్‌ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. అయితే వాహనం వద్ద ఎవరూ లేరు. దీంతో పోలీసులు, అధికారుల సహాయంతో దానిని సీజ్‌ చేసి కేసు నమోదు చేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ రమేష్‌ పాల్గొన్నారు.

108 అంబులెన్స్‌లో ప్రసవం

కలిగిరి: 108 అంబులెన్స్‌లో ఓ గర్భిణికి సురక్షితంగా కాన్పు చేశారు. స్థానికుల కథనం మేరకు.. మండలంలోని కలిగిరి పంచాయతీ జిర్రావారిపాళేనికి చెందిన హజరత్తమ్మకు ఆదివారం పురిటినొప్పులు రావడంతో 108కు సమాచారం ఇచ్చారు. సిబ్బంది ఆమెను ఆత్మకూరుకు తరలిస్తుండగా దారిలో నొప్పులు ఎక్కువయ్యాయి. ఈఎంటీ ఎస్‌కే మహ్మద్‌బాషా, పైలట్‌ సీహెచ్‌ వేణు డాక్టర్ల సూచనల మేరకు సురక్షితంగా కాన్పు చేశారు. హజరత్తమ్మ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీబిడ్డను ఆత్మకూరు ఏరియా వైద్యశాలకు తరలించారు.

రైలు కిందపడి

గుర్తుతెలియని వ్యక్తి మృతి

నెల్లూరు (క్రైమ్‌): నెల్లూరు – వేదాయపాళెం రైల్వే స్టేషన్ల మధ్య దిగువ మార్గంలో రైలు కింద పడి గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన ఆదివారం జరిగింది. మృతుడి వయసు 25 నుంచి 30 సంవత్సరాల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. నలుపు రంగు హాఫ్‌ హ్యాండ్స్‌ టీషర్ట్‌, నలుపు రంగు షార్ట్‌ ధరించి ఉన్నా డు. కుడి చేతిపై మోహన కృష్ణ, ఎడమ చేతిపై వినోద్‌ అని పచ్చబొట్లున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు నెల్లూరు జీఆర్పీ ఎస్సై మాలకొండయ్య తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

పొదలకూరు

నిమ్మధరలు (కిలో)

పెద్దవి : రూ.70

సన్నవి : రూ.60

పండ్లు : రూ.24

నెల్లూరు పౌల్ట్రీ

అసోసియేషన్‌ ధరలు

బ్రాయిలర్‌ (లైవ్‌) : 161

లేయర్‌ (లైవ్‌) : 95

బ్రాయిలర్‌ చికెన్‌ : 280

బ్రాయిలర్‌ స్కిన్‌లెస్‌ : 310

లేయర్‌ చికెన్‌ : 162

శిశువును అప్పగిస్తున్న సిబ్బంది
1/2

శిశువును అప్పగిస్తున్న సిబ్బంది

వాహనం వద్ద అధికారులు
2/2

వాహనం వద్ద అధికారులు

Advertisement
Advertisement