కదిరికి 30 అదనపు బస్సులు | Sakshi
Sakshi News home page

కదిరికి 30 అదనపు బస్సులు

Published Fri, Mar 10 2023 1:06 AM

మాట్లాడుతున్న జిల్లా ప్రజా రవాణా అధికారి మధుసూదన్‌ 
 - Sakshi

కదిరి అర్బన్‌: ఖాద్రీ లక్ష్మీనరసింహాస్వామి రథోత్సవం సందర్భంగా ఈ నెల 13న కదిరికి 30 ప్రత్యేక అదనపు బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ప్రజారవాణా అధికారి మధుసూదన్‌ పేర్కొన్నారు. గురువారం కదిరి డిపోలో అదనపు బస్సుల ఏర్పాటుపై డీఏం మైనోద్దీన్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ హరిమోహన్‌, అసిస్టెంట్‌ ఇంజినీర్‌ రామకృష్ణతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కదిరి డిపోలో ఉన్న 114 బస్సులతో పాటు అదనంగా మరో 30 బస్సులు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కదిరి నుంచి గోరంట్ల మీదుగా హిందూపురానికి 26 బస్సులు, నల్లమాడకు 7, మదనపల్లికి 25, బెంగళూరు 20, పులివెందుల 9, తలుపుల 7 దాదాపు 117 ట్రిప్పులతో బస్సులు నడుస్తాయన్నారు. జీవిమాను కూడలి, వేమారెడ్డి సర్కిల్‌, బస్టాండ్‌, సరస్వతీ విద్యామందిరం బస్‌స్టాప్‌ల వద్ద ఎండ వేడి తగలకుండా ప్రయాణికులకు ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. షెల్టర్ల వద్ద ఇద్దరు పోలీసులు (ఆర్టీసీ కానిస్టేబుల్స్‌) ఇద్దరు సేఫ్టీ డ్రైవింగ్‌ శిక్షకులు, వలంటీర్లు, సూపర్‌వైజర్లను నియమిస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement