పుట్టపర్తి టౌన్‌:..... | Sakshi
Sakshi News home page

పుట్టపర్తి టౌన్‌:.....

Published Wed, Mar 22 2023 2:02 AM

- - Sakshi

పుట్టపర్తి టౌన్‌: తెలుగు సంవత్సరాది ఉగాదిని ఘనంగా జరుపుకునేందుకు జిల్లా వాసులు సిద్ధమయ్యారు. జీవిత గమనంలో కష్టసుఖాలను ప్రతిబింబించే షడ్రుచుల సమ్మేళనంతో ఈ పండుగ జరుపుకుంటారు. శోభకృత్‌ నామ ఉగాది నేపథ్యంలో నూతన వస్త్రాలతో పాటు పండుగ సామగ్రి కొనుగోలు చేసేందుకు జనం ఉత్సాహం చూపగా మార్కెట్లు కిటకిటలాడాయి. ఆలయాలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. పుట్టపర్తి శిల్పారామంలో బుధవారం సాయంత్రం 6 గంటల నుంచి ఉగాది సంబరాలు నిర్వహిస్తున్నట్లు శిల్పారామం పాలనాధికారి రమేష్‌రెడ్డి తెలిపారు.

కలెక్టరేట్‌లో ఉగాది మహోత్సవం

పుట్టపర్తి అర్బన్‌: కలెక్టర్‌ బసంత్‌కుమార్‌ జిల్లా ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇల్లూ సుఖ సంతోషాలతో కళకళలాడాలని ఆకాంక్షించారు. కలెక్టరేట్‌లో బుధవారం ఉదయం 8 గంటల నుంచి ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయని వెల్లడించారు.

ఉగాది ‘శోభ’

Advertisement
Advertisement