జగనన్నే మళ్లీ రావాలంటున్నారు | Sakshi
Sakshi News home page

జగనన్నే మళ్లీ రావాలంటున్నారు

Published Tue, Apr 25 2023 12:10 AM

మాట్లాడుతున్న మాలగుండ్ల శంకరనారాయణ  
 - Sakshi

పెనుకొండ: పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ఆదర్శవంతమైన పాలన సాగిస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి కావాలని ప్రజలంతా కోరుకుంటున్నారంటూ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, పెనుకొండ ఎమ్మెల్యే మాలగుండ్ల శంకరనారాయణ తెలిపారు. ఇందుకు జగనన్నే మా భవిష్యత్‌ కార్యక్రమానికి ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందనే నిదర్శమన్నారు. స్థానిక తన క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మా నమ్మకం నువ్వే జగన్‌ కార్యక్రమంలో చేపట్టి 15 రోజులు దాటిందన్నారు. ఈ నెల 7న చేపట్టిన జగనన్నే మా భవిష్యత్‌ కార్యక్రమాన్ని గృహ సారధులు, సచివాలయ కన్వీనర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకుల సహకారంతో దిగ్విజయంగా కొనసాగుతోందన్నారు. ఇప్పటి వరకూ 1.60 కోట్ల కుటుంబాలను కలసి సీఎం వైఎస్‌ జగన్‌ పాలనపై అభిప్రాయాలు సేకరించారని, ఇందులో అత్యధికులు మళ్లీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగనే రావాలనే ఆకాంక్షను బలంగా వ్యక్త పరిచారన్నారు. పెనుకొండ నియోజకవర్గంలోని 70 వేల కుటుంబాలను సర్వే చేస్తే అందరూ జగన్‌ సర్కార్‌కు మద్దతు తెలిపారన్నారు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను కొనియాడారన్నారు. టీడీపి బలంగా ఉన్న ప్రాంతంలోనూ జగనన్న పాలన కావాలని ప్రజలు నినదిస్తున్నారన్నారు.

దుష్ప్రచారాన్ని నమ్మొద్దు

జగనన్న పాలనపై టీడీపీ మాజీ ఎమ్మెల్యేలు సాగిస్తున్న దుష్ట్రచారాన్ని నమ్మబోరాదని ప్రజలకు శంకరనారాయణ పిలుపునిచ్చారు. చంద్రబాబు సెల్ఫీ తీసుకున్నాడు కాబట్టి తాము కూడా తీసుకోవాలన్న వింత జబ్బు టీడీపీ నేతలకు, మాజీ ఎమ్మెల్యేలకు సోకిందని ఎద్దేవా చేశారు. గొల్లపల్లి రిజర్వాయర్‌ను చంద్రబాబే తీసుకువచ్చాడంటూ సవితమ్మ సెల్ఫీ దిగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో రిజర్వాయర్‌ నిర్మాణానికి ఇచ్చింది కేవలం రూ.9 కోట్లు మాత్రమేనన్న విషయాన్ని గుర్తించాలన్నారు. డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి చలువతోనే ఈ రిజర్వాయర్‌ పూర్తయిందనేది అక్షర సత్యమన్నారు. హంద్రీనీవా కాలువ, రిజర్వాయర్‌ నిర్మాణానికి డాక్టర్‌ వైఎస్సార్‌ రూ.5,400 కోట్లు ఇచ్చిన విషయాన్ని టీడీపీ నాయకులు మరవరాదన్నారు. అలాగే కియా కార్ల పరిశ్రమ వద్ద, పెనుకొండ కొండ రోడ్డుకు ఒక్క రూపాయి కూడా ఇవ్వని నాటి ఎమ్మెల్యే... నేడు పూర్తి చేసిన కొండ రోడ్డు వద్దకెళ్లి సెల్ఫీ దిగి తానే పూర్తి చేసినట్లుగా సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడం సిగ్గుచేటన్నారు. బొల్లిబాబును చూసి కియా పరిశ్రమ రాలేదని, ప్రధాని మోదీ చలువతోనే పరిశ్రమ ఏర్పాటైందన్నారు. పరిశ్రమ ఏర్పాటుకు భూములిచ్చిన రైతులకు ఎకరాకు రూ.9 లక్షలు ఇచ్చి, చదునుకు ఎకరాకు రూ.30 లక్షలు ఖర్చు చూపి చంద్రబాబు, లోకేష్‌, బీకే పార్థసారథి భారీ దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. తాము చేయని పనుల వద్ద పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, పల్లె రఘునాథరెడ్డి సెల్ఫీలు దిగి వైరల్‌ చేయడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. 2019కు ముందు, ఆ తర్వాత జరిగిన అభివృద్ధిపై దమ్ముంటే టీడీపీ నాయకులు శ్వేత పత్రం విడుదల చేయాలని సవాల్‌ విసిరారు.

సమావేశంలో వైఎస్సార్‌సీపీ మండల కన్వీనర్లు నాగలూరు బాబు, బోయ నరసింహ, సోమందేపల్లి కన్వీనర్‌ నారాయణరెడ్డి, మాజీ కన్వీనర్లు శ్రీకాంత్‌రెడ్డి, వెంకటరత్నం, నగర పంచాయతీ చైర్మన్‌ ఉమర్‌ఫారూక్‌ఖాన్‌, వైస్‌ చైర్మన్‌ సునీల్‌, సింగిల్‌విండో అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ముఖ్య నాయకులు రామ్మోహన్‌రెడ్డి, రామాంజినేయులు, వెంకటరామిరెడ్డి, భాస్కర్‌నాయక్‌, గోపాల్‌రెడ్డి, గుట్టూరు నారాయణస్వామి, మండల వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ కొండలరాయుడు, మాజీ సర్పంచ్‌ రాజగోపాలరెడ్డి, సోమశేఖరరెడ్డి, మారుతి పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యేలకు సెల్ఫీల పిచ్చి పట్టింది

మోదీ చలువతోనే కియా పరిశ్రమ ఏర్పాటు

గొల్లపల్లి రిజర్వాయర్‌కు ప్రాణం పోసింది మహానేత వైఎస్సార్‌

జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు మాలగుండ్ల

Advertisement

తప్పక చదవండి

Advertisement