గోల్‌మాల్‌పై విజిలెన్స్‌ విచారణ పూర్తి! | Sakshi
Sakshi News home page

గోల్‌మాల్‌పై విజిలెన్స్‌ విచారణ పూర్తి!

Published Mon, Aug 21 2023 1:38 AM

- - Sakshi

మడకశిర: నియోజకవర్గంలో పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో జరిగిన సిమెంట్‌ గోల్‌మాల్‌పై విజిలెన్స్‌ విచారణ పూర్తి అయినట్లు సమాచారం. త్వరలోనే విచారణ నివేదికను అధికారులు ప్రభుత్వానికి అందించనున్నట్లు తెలుస్తోంది. దాదాపు 3 నెలల పాటు విజిలెన్స్‌ బృందం ఈ అంశంపై విచారణ చేసింది. నియోజకవర్గంలోని మడకశిర, అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగళి మండలాల్లో విస్తృతంగా పర్యటించారు. పీఆర్‌ పరిధిలో జరిగిన ప్రతి పనినీ తనిఖీ చేసి ఎంత మేర సిమెంట్‌ వినియోగించారో లెక్కలేశారు. పనులు చేసిన కాంట్రాక్టర్లను కూడా విచారించారు. ఏఏ పనికి ఎన్ని బస్తాల సిమెంట్‌ ఇచ్చారో తెలుసుకున్నారు. పీఆర్‌ శాఖకు ప్రభుత్వం సరఫరా చేసిన సిమెంట్‌ బస్తాల వివరాలను కూడా సంబంధిత ఉన్నతాధికారుల నుంచి తెలుసుకున్నారు. విచారణ పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్లు అధికార వర్గాల ద్వారా తెలిసింది.

సిమెంట్‌ గోల్‌మాల్‌ నేపథ్యమిదీ...

మడకశిర పంచాయతీరాజ్‌ శాఖ పరిధిలో 2019 నుంచి 2022 వరకు దాదాపు 800 అభివృద్ధి పనులు చేపట్టారు. ప్రభుత్వం 2 లక్షల బస్తాలకు పైగా సిమెంట్‌ సరఫరా చేసినా, తమకు సక్రమంగా అందక కాంట్రాక్టర్లు పనులను వేగవంతంగా చేయలేకపోయారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే తిప్పేస్వామి అధికారులతో సమీక్ష నిర్వహించగా.. సిమెంట్‌ బస్తాల గోల్‌మాల్‌ జరిగినట్లు వెలుగులోకి వచ్చింది. వెంటనే ఎమ్మెల్యే అప్పటి పీఆర్‌ డీఈ, ఏఈలపై ఫిర్యాదు చేశారు. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. దాదాపు 90 వేల బస్తాల సిమెంట్‌ గోల్‌మాల్‌ అయినట్లు ప్రాథమికంగా గుర్తించి డీఈ, ముగ్గురు ఏఈలను సస్పెండ్‌ చేసింది. దీనిపై లోతుగా విచారణ చేయడానికి విజిలెన్స్‌ విభాగానికి అప్పగించింది.

త్వరలో ప్రభుత్వానికి నివేదిక

Advertisement
Advertisement