జాతీయ స్థాయి హాకీ పోటీలకు చిగిచెర్ల విద్యార్థులు | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి హాకీ పోటీలకు చిగిచెర్ల విద్యార్థులు

Published Thu, Nov 9 2023 12:56 AM

ఎంపికై న విద్యార్థులతో ఉపాధ్యాయులు  
 - Sakshi

ధర్మవరం రూరల్‌: మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌ వేదికగా డిసెంబర్‌లో జరిగే ఎస్‌జీఎఫ్‌ జాతీయ స్థాయి హాకీ పోటీలకు ధర్మవరం మండలం చిగిచెర్ల జెడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థినులు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తిమ్మారెడ్డి మంగళవారం తెలిపారు. స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో ఇటీవల విశాఖ జిల్లా నక్కలపల్లిలో జరిగిన అండర్‌ 17 బాలబాలికల రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి అనంతపురం జిల్లా జట్టు తరఫున ప్రాతినిథ్యం వహించిన హేమతపస్విని, పూజిత అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టులో చోటు దక్కించుకున్నారన్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలోనూ రాణించాలంటూ బుధవారం విద్యార్థినిలను పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.

రాష్ట్ర స్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలకు

ఎనుములపల్లి విద్యార్థులు

పుట్టపర్తి టౌన్‌: రాష్ట్రస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీలకు ఎనుములపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సుధాకర్‌, పీఈటీ రమేష్‌బాబు బుధవారం తెలిపారు. ఈ నెల 5న బుక్కపట్నంలోని జెడ్పీ ఉన్నత పాఠశాల వేదికగా జరిగిన ఎస్‌జీఎఫ్‌ అండర్‌ 17, 19 జిల్లా స్థాయి పోటీల్లో తమ పాఠశాల విద్యార్థులు విజయ్‌కుమార్‌, అభినయ్‌ ప్రతిభ చాటుకుని రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లుగా వివరించారు.

క్రీడల్లోనూ ప్రతిభ చాటాలి

అనంతపురం: సాంకేతిక విద్యలో రాణిస్తూనే క్రీడల్లోనూ ప్రతిభ చాటాలని జేఎన్‌టీయూ (ఏ) వీసీ జింకా రంగజనార్దన పిలుపునిచ్చారు. నగరంలోని ఓటీపీఆర్‌ఐలో బుధవారం ఇంట్రా–కాలేజ్‌ స్పోర్ట్స్‌ మీట్‌–2కే23 అట్టహాసంగా ప్రారంభించారు. ముఖ్య అతిథి వీసీ జింకా రంగజనార్దన మాట్లాడుతూ గతంలో ఎన్నడూ లేని రీతిలో క్రీడోత్సవాలను నిర్వహిస్తున్న డైరెక్టర్‌ బి.దుర్గాప్రసాద్‌ కృషి ప్రశంసనీయమన్నారు. గెలుపోటములను సమానంగా తీసుకునే గుణం క్రీడలతో అలవడుతుందన్నారు. నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌, ఓటీపీఆర్‌ఐ డైరెక్టర్‌, పాలకమండలి సభ్యుడు బి.దుర్గాప్రసాద్‌, ప్రిన్సిపాల్‌ చక్కా గోపీనాథ్‌, ఫుడ్‌ టెక్నాలజీ విభాగాధిపతి స్వరూపరాణి, పాలకమండలి సభ్యుడు ఎం.రామశేఖర్‌రెడ్డి, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు.

బ్యాటింగ్‌ చేస్తున్న వీసీ రంగజనార్దన, 
కీపింగ్‌ చేస్తున్న రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌
1/2

బ్యాటింగ్‌ చేస్తున్న వీసీ రంగజనార్దన, కీపింగ్‌ చేస్తున్న రిజిస్ట్రార్‌ సి.శశిధర్‌

ఎంపికై న విద్యార్థులతో 
పీడీ ప్రతాపరెడ్డి
2/2

ఎంపికై న విద్యార్థులతో పీడీ ప్రతాపరెడ్డి

Advertisement
Advertisement