జాతీయ హాకీ పోటీలకు డిజిటల్‌ అసిస్టెంట్‌ ఎంపిక | Sakshi
Sakshi News home page

జాతీయ హాకీ పోటీలకు డిజిటల్‌ అసిస్టెంట్‌ ఎంపిక

Published Sat, Nov 11 2023 1:18 AM

పవన్‌కుమార్‌ను అభినందిస్తున్న దృశ్యం - Sakshi

బత్తలపల్లి: పోట్లమర్రి సచివాలయ డిజిటల్‌అసిస్టెంట్‌ పవన్‌కుమార్‌ ఆలిండి యా సివిల్‌ సర్వీసెస్‌ హాకీ పోటీల్లో పాల్గొనే ఆంధ్ర జట్టుకు ఎంపికై నట్లు ఎంపీడీఓ సాయిమనోహర్‌ శుక్రవారం తెలిపారు. పవన్‌కుమార్‌ భువనేశ్వర్‌లో ఈనెల 15 నుంచి 24 వరకు జరగనున్న ఆలిండియా సివిల్‌ సర్వీసెస్‌ హాకీ పోటీల్లో పాల్గొంటున్నారన్నారు.ఎంపీడీఓ, సిబ్బంది, వైఎస్సార్‌సీపీ మాజీ మండల కన్వీనర్‌ బగ్గిరి బయపరెడ్డి, ఈదుల ముష్టూ రు, పోట్లమర్రి సర్పంచులు చెడిపోతుల గోపాల్‌, అక్కిం దామోదర్‌ అభినందించారు.

క్వారీ యజమానిపై హత్యాయత్నం

డబ్బు విషయంలో గొడవ

అనంతపురం క్రైం: నగరంలోగ్రానైట్‌ క్వారీ యజమానిపై హత్యాయత్నం జరిగిన విషయం ఆల స్యంగా వెలుగు చూ సింది. బాధితుడు, పోలీసుల కథనం మేరకు ... అనంతపురం సాయినగర్‌లో నివాసముంటున్న సుశీల్‌కు బుక్కరాయసముద్రం, శ్రీసత్యసాయి జిల్లా మడకశిర, కదిరి ప్రాంతాల్లో గ్రానైట్‌ క్వారీలు ఉన్నాయి. మూడు నెలల కిందట కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన నూర్‌ అనే వ్యక్తితో రాయిని కోసే మిషన్‌, ఇతర పరికరాలు అద్దెకు తీసుకుని, బుక్కరాయసముద్రంలోని క్వారీకి తీసుకెళ్లాడు. సెట్‌ చేసిన తర్వాత మిషన్‌ పనిచేయలేదని యజమానికి సమాచారమిచ్చాడు. వినియోగంలోకి తీసుకొచ్చిన రోజు నుంచి తాను అద్దె చెల్లిస్తానని స్పష్టం చేశాడు. అయితే నూర్‌ మిషన్‌ రిపేరీకి టెక్నీషియన్లను పంపించకపోగా.. నెలల తరబడి పరిక రాలను క్వారీలోనే ఉంచాడు. ఎట్టకేలకు గురువారం మధ్యాహ్నం ఫోన్‌ చేసి లారీ తెచ్చి మిషన్‌ను తీసుకెళ్తామని నూర్‌ చెప్పాడు. తమకు మూడు నెలల అద్దె చెల్లించాల్సి ఉంటుందని, ఇవ్వకపోతే అంతు చూస్తామంటూ హుకుం జారీ చేశాడు. పనిచేయని మిషన్‌కు ఎలా అద్దె చెల్లిస్తామని సుశీల్‌ ప్రశ్నించాడు. దీంతో నూర్‌ ఫోన్‌ పెట్టేసి కారులో తన అనుచరుడితో కలిసి అనంతపురంలోని సుశీల్‌ ఇంటికి చేరుకున్నాడు. వచ్చీ రాగానే సుశీల్‌ సోదరుడిపై దాడి చేసి, లోపలి నుంచి వచ్చిన సుశీల్‌పై కత్తి, ఇనుపరాడ్లతో విరుచుకుపడ్డారు. సుశీల్‌ తలకు తీవ్ర గాయమైంది. భయాందోళన గురైన సుశీల్‌ కుటుంబ సభ్యులు డయల్‌ 100కు ఫోన్‌ చేశారు. పోలీసులు వస్తారన్న భయంతో నూర్‌ తన అనుచరులతో కలిసి కారులో ఉడాయించేందుకు ప్రయత్నించాడు. అలా వేగంగా వెళ్లే క్రమంలో ఆ వీధిలోని కాంపౌండ్‌ను ఢీకొట్టి..కారు కల్వర్టులో ఇరుక్కుంది. ఈ ఘటనలో నూర్‌ అనుచరుడికి స్వల్ప గాయాలయ్యాయి. ఇంతలో పోలీసులు అక్కడికి చేరుకుని నూర్‌తో పాటు అతని అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాల పాలైన సుశీల్‌ను కుటుంబ సభ్యులు సర్వజనాస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు టూటౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

గాయపడ్డ సుశీల్‌
1/1

గాయపడ్డ సుశీల్‌

Advertisement
Advertisement