కేసులో రాజీ కావాలంటూ బెదిరింపులు

20 Nov, 2023 00:18 IST|Sakshi

అనంతపురం క్రైం: నగరంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో పనిచేస్తున్న అవివాహితను ప్రేమ పేరుతో మోసం చేసి శారీరక అవసరాలు తీర్చుకున్నారన్న ఫిర్యాదుపై 2020లో దిశ పోలీసులు నమోదు చేసిన కేసులో బాధితురాలికి బెదిరింపులు మొదలయ్యాయి. ఈ కేసులో నిందితుడిగా ఉన్న ఏఆర్‌ పీసీ సుధీర్‌ను రిమాండ్‌కు పంపారు. ప్రస్తుతం కోర్టు పరిధిలో విచారణలో ఉంది. ఈ నేపథ్యంలో కేసును వెనక్కు తీసుకోకపోతే చంపుతామని నిందితుడు బెదిరింపులకు దిగడంతో పోలీసు స్పందనలో మరోసారి బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు సుధీర్‌తో పాటు అతని తల్లిదండ్రులు, బంధువులు మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు