‘స్పందన’ అర్జీదారులకు సత్వర న్యాయం | Sakshi
Sakshi News home page

‘స్పందన’ అర్జీదారులకు సత్వర న్యాయం

Published Tue, Nov 21 2023 12:30 AM

అర్జీలు స్వీకరిస్తున్న కలెక్టర్‌ అరుణ్‌బాబు  - Sakshi

పుట్టపర్తి అర్బన్‌: ‘స్పందన’ కార్యక్రమానికి వచ్చే అర్జీదారులకు సత్వర న్యాయం చేయాలని కలెక్టర్‌ అరుణ్‌బాబు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో ‘స్పందన’ నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి వచ్చిన 322 మంది నుంచి కలెక్టర్‌ అరుణ్‌బాబు అర్జీలు స్వీకరించారు. సంబంధిత అధికారులతో మాట్లాడారు. విజ్ఞప్తులపై తక్షణమే స్పందించాలన్నారు. క్షేత్రస్థాయిలో పారదర్శకంగా విచారించాలని సూచించారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా సమస్య పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ చేతన్‌, డీఆర్‌ఓ కొండయ్య, ఆర్డీఓ భాగ్యరేఖ, డీఆర్‌డీఏ పీడీ నరసయ్య, నోడల్‌ ఆఫీసర్‌ శివారెడ్డి, సీపీఓ విజయ్‌కుమార్‌, ఇన్‌చార్జ్‌ డీపీఓ శివకుమారి, జిల్లా వ్యవసాయాధికారి సుబ్బారావు, డీహెచ్‌ఓ చంద్రశేఖర్‌, సివిల్‌ సప్లయీస్‌ అధికారి వంశీకృష్ణారెడ్డి, ఐసీడీఎస్‌ పీడీ లక్ష్మీకుమారి, తదితరులు పాల్గొన్నారు.

అర్జీల్లో కొన్ని..

● మడకశిర ప్రాంతంలోని శ్రీతులసీధామం వృద్ధాశ్రమంలో 60 మంది వృద్ధులు, దివ్యాంగులు, కంటి చూపు లేనివారు ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. ఆశ్రమంలో ప్రభుత్వం తరఫున మరుగు దొడ్లు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.

● గోరంట్ల మండలం గుమ్మయ్యగారిపల్లి సర్వే నంబర్‌ 65,69లోని తమ 3.06 ఎకరాల భూమిని కొందరు ఆక్రమించేందుకు యత్నిస్తున్నారని గ్రామానికి చెందిన నంజప్ప కుమారుడు ఈశ్వరప్ప తెలిపారు. న్యాయం చేయాలని వేడుకున్నారు.

● కదిరి మండలం సున్నపుగుట్ట తండాలో అనధికారికంగా ఏర్పాటు చేసిన పశువుల షెడ్డుతో ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు మహబూబ్‌, చాంద్‌బాష, ముంతాజ్‌, జరీనా తదితరులు వాపోయారు. తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

● కొత్తచెరువు 4వ వార్డులో నివాసముంటున్న తమకు స్థలం మంజూరు చేసి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పలువురు కోరారు. సొంతిళ్లు లేక ఇబ్బంది పడుతున్నామన్నారు. అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.

కలెక్టర్‌ అరుణ్‌బాబు

Advertisement
Advertisement