కంటి చూపు బాగుపడింది | Sakshi
Sakshi News home page

కంటి చూపు బాగుపడింది

Published Tue, Nov 28 2023 1:22 AM

- - Sakshi

వయస్సు పెరగడంతో కంటి చూపు సరిగా కనబడేది కాదు. అక్టోబర్‌లో మా ఊళ్లోనే ఏర్పాటు చేసిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరానికి వెళ్లి చూపించుకున్నా... పైసా ఖర్చు లేకుండా అన్ని రకాల వైద్య పరీక్షలు చేశారు. కంటి చూపు తగ్గిందంటూ అద్దాలు ఇచ్చారు. ఇప్పుడు చూపు బాగుంది. అన్ని పనులూ చేసుకుంటున్నా. చాలా సంతోషంగా ఉంది. వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి, ఉచితంగా చికిత్సలు చేయించిన సీఎం వైఎస్‌ జగన్‌ చల్లగా ఉండాలని కోరుకుంటున్నా.

– లక్ష్మమ్మ, దేవన్నపాళ్యం మడకశిర మండలం

మా పాపను ఆదుకున్నారు

నేను, నా భార్య నాగమ్మ దినసరి కూలి పనులతో జీవనం సాగిస్తున్నాం. ముగ్గురు కుమార్తెలున్నారు. ప్రస్తుతం పదేళ్ల వయసున్న పెద్ద కుమార్తె కమలాగ్లోరీకు చిన్నప్పుడే రెండు కాళ్లు చచ్చుపడ్డాయి. ఎవరో ఒకరు తోడు లేకపోతే కనీసం పక్కకు కూడా కదల్లేదు. దీంతో ఎవరో ఒకరు కూలి పనులకు వెళుతూ.. మరొకరు పాప వద్దే ఉంటున్నాం. పాప పరిస్థితి చూస్తూ ఏడవని రోజంటూ లేదు. కుటుంబ పోషణ భారంగా ఉండడంతో పాపకు పింఛనైనా అందజేయాలని కోరుతూ గత ప్రభుత్వ హయాంలో ఆఫీసుల చుట్టూ తిరగాను. ఫలితం దక్కలేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నా కుమార్తెకు ఆధార్‌ కార్డు... దీని ఆధారంగా సదరన్‌ సర్టిఫికెట్‌ మంజూరయ్యాయి. అనంతరం వలంటీర్‌ వచ్చి పింఛన్‌ కానుకకు దరఖాస్తు చేయించాడు. నయా పైసా ఖర్చు లేకుండా మా పాప పేరున పింఛన్‌ మంజూరైంది. ప్రతి నెలా 1వ తేదీనే పింఛన్‌ సొమ్మును అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగనన్నకు రుణపడి ఉంటాం.

– తిప్పన్న, శ్రీరంగరాజుపల్లి, పరిగి మండలం

ఇంగ్లిష్‌ మీడియం

చదువులతో మేలు

ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడంతో పేద విద్యార్థులకు గొప్ప మేలు జరిగింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందజేస్తున్నారు. నా సర్వీస్‌లో ఇప్పటి వరకూ ఇలాంటి గొప్ప సంస్కరణలు అమలు చేసింది ఎన్నడూ చూడలేదు. మనబడి నాడు – నేడు పనులతో ప్రభుత్వ బడుల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. ఏ ప్రభుత్వ పాఠశాలలోనూ విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బంది పడకుండా అన్ని వసతులు కల్పించారు. – రమణారెడ్డి, టీచర్‌, పుట్టపర్తి

సొంతింటి కల నెరవేరింది

మేము కొన్నేళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. సొంతింటి కోసం తెలుగుదేశం హయాంలో అర్జీలు పెట్టుకొని కాళ్లరిగేలా తిరిగాము. అయితే జగనన్న ప్రభుత్వంలో వలంటీర్‌ ద్వారా దరఖాస్తు చేసుకున్నాం. ఇళ్లు మంజూరైందని చల్లని తీపి కబులు చెప్పారు. పట్టా కూడా చేతికి ఇచ్చారు. ఇల్లు కట్టుకున్నాం. దీంతో ఎన్నో ఏళ్ల మా సొంతింటి కల నెరవేరింది. మా లాంటి పేదలకు ప్రభుత్వమే సాయం చేసి చేదోడు వాదోడుగా నిలుస్తోంది. – రామేశ్వరి,

అచ్యుతాపురం, యల్లనూరు మండల

1/4

2/4

3/4

4/4

Advertisement
Advertisement