గతమంతా కష్టాలే | Sakshi
Sakshi News home page

గతమంతా కష్టాలే

Published Sun, Dec 3 2023 12:20 AM

- - Sakshi

గత ప్రభుత్వ హయాంలో కష్టాలు.. ఇబ్బందులు తప్ప మరేమీ చూడలేదు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయిన తర్వాత పింఛన్‌ కష్టాలు తీరాయి. ప్రతి నెలా 1వ తారీఖునే ఇంటి వద్దకే వచ్చి పింఛన్‌ అందజేస్తున్నారు. వలంటీర్‌ వ్యవస్థ చాలా బాగుంది. ఎలాంటి సర్టిఫికెట్‌ కావాలన్నా ఇంటి వద్దనే తీసుకుంటున్నాం. ప్రభుత్వ కార్యాలయం చుట్టూ తిరిగే బాధ తప్పింది. జగనన్న సురక్ష కార్యక్రమం ద్వారా నేనూ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందాను. సీఎం వైఎస్‌ జగన్‌ పాలన చాలా బాగుంది. – చిన్నరంగడు పెద్దవడుగూరు

నాకు ఆయువు పోశారు

నాకు 62 ఏళ్లు. లారీ డ్రైవర్‌గా పనిచేసే నా భర్త వీరన్న 30 ఏళ్ల క్రితమే మరణించాడు. ముగ్గురు కుమారులు, ఓ కుమార్తెను అతి కష్టంపై పెంచి పెద్ద చేశా. కూలి పనులు చేస్తూ కష్టపడి దాచుకున్న డబ్బుతో పిల్లలందరికీ పెళ్లిళ్లు చేశా. ప్రస్తుతం నా చిన్న కొడుకు ఉరుకుంద ఇంట్లో ఉంటున్నా. నా కోడలు నైటీలు కుడుతుంటే వాటిని ప్యాకింగ్‌ చేస్తుంటాను. జీవితం బాగుపడుతోందనుకుంటున్న తరుణంలో గత ఏడాది జూలైలో గుండెనొప్పి వచ్చింది. వెంటనే నన్ను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం కింద అనంతపురంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లి ఉచితంగా ఆపరేషన్‌ చేసి, నాకు ఆయువు పోశారు. ఐదు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉన్నాం. ఒక్క పైసా కూడా మా చేతి నుంచి ఖర్చు కాలేదు. డిశ్చార్జ్‌ సమయంలో ఏడాదికి సరిపోయే మందులూ ఇచ్చారు. అతే కాక వైఎస్సార్‌ చేయూత ద్వారా ఏటా రూ.18,750 చొప్పున మూడుసార్లు డబ్బులు పడ్డాయి. ప్రతి నెలా రూ.2,750 వితంతు పింఛన్‌ అందజేస్తున్నారు. మరో పది కాలాల పాటు సీఎంగా వైఎస్‌ జగనే ఉండాలని కోరుకుంటున్నా. – పి.లక్ష్మీదేవి, గుంతకల్లు

ఇబ్బందులు తొలిగాయి

రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆర్థిక ఇబ్బందులు దూరమయ్యాయి. ఇంటర్‌ వరకూ చదువుకున్న నా కుమారుడు ఆంజనేయులుకు వలంటీర్‌గా పనిచేసే అవకాశం దక్కింది. ఆసరా పథకంతో నాకు ఏటా రూ.10 వేల చొప్పున మూడు దఫాలుగా రూ.30 వేల సాయం అందింది. నా భర్త హనుమంతుకు కళాకారుల పింఛన్‌ అందుతోంది. చేయూత పథకంతో ఏటా రూ.18,750 ఇస్తున్నారు. కొడుక్కి పెళ్లి చేయడంతో కల్యాణమస్తు పథకం కింద కోడలు దివ్యకు రూ.లక్ష లబ్ధి చేకూరింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మా కష్టాలు పూర్తిగా తొలగిపోయాయి.

– హెచ్‌.రామాంజినమ్మ, రామనేపల్లి,

బెళుగుప్ప మండలం

కంటి చూపు బాగుపడింది

కంటి చూపు సక్రమంగా లేక ఇబ్బంది పడేదాన్ని. డబ్బు సమస్య ఉండడంతో ఆస్పత్రికి వెళ్లలేక పోయాను. అయితే మా ఊళ్లోనే పెట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష వైద్య శిబిరంలో చూపించుకుంటే అనంతపురంలోని పెద్దాస్పత్రికి తీసుకెళ్లి పరీక్షలు చేయించారు. అద్దాలిచ్చారు. ఇప్పుడు చూపు బాగుంది. ఇంటి వద్దకే డాక్టర్లు వచ్చి వైద్య చికిత్సలు చేసేలా చర్యలు తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌ పాలన ఎంతో బాగుంది.

– లక్ష్మక్క, కమ్మూరు, కూడేరు మండలం

1/4

2/4

3/4

4/4

Advertisement

తప్పక చదవండి

Advertisement