ఉత్సాహంగా పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌

Published Sun, Dec 24 2023 1:34 AM

టాస్‌ వేసి మ్యాచ్‌ను ప్రారంభిస్తున్న 
అడిషనల్‌ ఎస్పీ విష్ణు   - Sakshi

క్రికెట్‌ విన్నర్స్‌గా నిలిచిన డీఏఆర్‌–1 జట్టు

పుట్టపర్తి టౌన్‌: శాంతిభద్రతల పరిరక్షణలో నిత్యం తలమునకలై ఉండే పోలీసులకు ఉల్లాసం కలిగించేందుకు నిర్వహిస్తున్న పోలీస్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ఉత్సాహంగా సాగింది. జిల్లా పోలీస్‌ కార్యాలయం సమీపంలోని ప్రైవేటు గ్రౌండ్‌లో వారం రోజులుగా సబ్‌ డివిజనల్‌ అల్‌ విన్నింగ్స్‌, ఆర్ముడ్‌ రిజర్వ్‌ పార్టీ గ్రూప్‌ల వారీగా క్రికెట్‌ మ్యాచ్‌లు జరిగాయి. గ్రూప్‌–ఏ నుంచి డీఎఆర్‌–1 జట్టు, గ్రూప్‌–బి నుంచి డీఎఆర్‌–2 జట్లు ఫైనల్‌కు చేరాయి. శనివారం జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ను అడిషనల్‌ ఎస్పీ విష్ణు టాస్‌ వేసి ప్రారంభించారు. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన డీఏఆర్‌ –2 జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌ చేసిన డీఏఆర్‌–1 జట్టు 15 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 124 లక్ష్యాన్ని ఛేదించింది. విన్నర్స్‌, రన్నర్స్‌కు 29వ తేదీ నిర్వహించే స్టోర్స్‌ డేలో బహుమతులు ప్రధానం చేయనున్నారు. కార్యక్రమంలో ఏఆర్‌ డీఎస్పీ విజయకుమార్‌, ఆర్‌ఐలు టైటాస్‌, రాజశేఖర్‌రెడ్డి, నారాయణ, ఆర్‌ఎస్‌ఐలు రాజు, ప్రదీప్‌సింగ్‌, శ్రీరాములు తదితరలు పాల్గొన్నారు.

నేడు లేపాక్షికి కేంద్రమంత్రి రాక

లేపాక్షి: కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవ్‌సింగ్‌ చౌహాన్‌ ఆదివారం లేపాక్షికి రానున్నారని ఎంపీడీఓ నరసింహనాయుడు తెలిపారు. స్థానిక ్థఓరియంటల్‌ ఉన్నత పాఠశాలలో ఉదయం 10 గంటలకు జరిగే వికసిత్‌ భారత్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతారని పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారులు హాజరు కావాలన్నారు.

న్యూస్‌రీల్‌

Advertisement
Advertisement