జిల్లాలో విస్తృతంగా ‘సెబ్‌’ తనిఖీలు | Sakshi
Sakshi News home page

జిల్లాలో విస్తృతంగా ‘సెబ్‌’ తనిఖీలు

Published Fri, Jan 5 2024 12:18 AM

-

పుట్టపర్తి టౌన్‌: జిల్లా వ్యాప్తంగా సెబ్‌ అధికారులు గురువారం విస్తృత తనిఖీలు చేపట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి మద్యం అక్రమంగా దిగుమతి చేసుకుని విక్రయాలు సాగిస్తున్న వారితో పాటు నాటుసారా తయారీదారులను గుర్తించి 13 కేసులు నమోదు చేశారు. ధర్మవరం సెబ్‌స్టేషన్‌ పరిధిలో 2 కేసులు నమోదు చేసి, 375 లీటర్ల బెల్లం ఊటను ధ్వంసం చేశారు. ఈ కేసుల్లో నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. కదిరి సెబ్‌ స్టేషన్‌ పరిధిలో 1 కేసు నమోదు చేసి, 6 లీటర్ల బెల్లం ఊట, హిందూపురం సెబ్‌స్టేషన్‌ పరిధిలో 2 కేసులు నమోదు చేసి, 100 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకుని, ద్విచక్ర వాహనాన్ని సీజ్‌ చేశారు. తూముకుంట చెక్‌పోస్టు వద్ద 107 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకుని ద్విచక్ర వాహనాన్ని సీజ్‌ చేశారు. పుట్టపర్తి సెబ్‌ స్టేషన్‌ పరిధిలో 25 టెట్రా ప్యాకెట్ల కర్ణాటక మద్యం, సీకేపల్లి సెబ్‌ స్టేషన్‌లో 35 ప్యాకెట్లు, పెనుకొండ సెబ్‌ స్టేషన్‌ పరిధిలో 40, తనకల్లు సెబ్‌ స్టేషన్‌ పరిధిలో 40 మద్యం పాకెట్లు స్వాధీనం చేసుకుని, నిందితులపై కేసులు నమోదు చేసి, రిమాండ్‌కు తరలించారు.

Advertisement
Advertisement