పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలను పర్యవేక్షించండి | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలను పర్యవేక్షించండి

Published Tue, Apr 9 2024 12:25 AM

-

హిందూపురం టౌన్‌: పోలింగ్‌ కేంద్రాలను సందర్శించి అందులో సౌకర్యాలను పర్యవేక్షించాలని సెక్టోరియల్‌ అధికారులను జేసీ అభిషేక్‌ కుమార్‌ ఆదేశించారు. సోమవారం హిందూపురం తహసీల్దార్‌ కార్యాలయంలో సెక్టోరియల్‌ అధికారులతో ఆయన సమావేశమై మాట్లాడారు. ఎన్నికల్లో అప్రమత్తంగా వ్యవహరించాలన్నారు. విధుల్లో అలసత్వం వీడాలని హెచ్చరించారు. పట్టణంలోని ముదిరెడ్డిపల్లి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, అరవింద్‌ నగర్‌లోని మండల పరిషత్‌ మోడల్‌ ప్రైమరీ పాఠశాలలోని 25 నుంచి 29వ పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.ఎన్నికల నాటికి పోలింగ్‌ కేంద్రాల్లో తప్పనిసరిగా అన్ని మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శివప్రసాదరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ శ్రీకాంత్‌రెడ్డి, లేపాక్షి తహసీల్దార్‌ బాలనరసింహులు, చిలమత్తూరు తహసీల్దార్‌ భాగ్యలత, ఆర్‌ఐ అమరేంద్ర, ఎన్నికల డీటీ రెడ్డి శేఖర్‌, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

కొడికొండ చెక్‌పోస్ట్‌లో తనిఖీలు

చిలమత్తూరు: మండలంలోని 44 జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన కొడికొండ చెక్‌పోస్ట్‌లోని పోలీస్‌ చెక్‌ పాయింట్‌ను సోమవారం జేసీ అభిషేక్‌కుమార్‌ తనిఖీ చేశారు. సిబ్బందికి కల్పించిన సౌకర్యాలపై ఆరా తీశారు. గత గురువారం సుడిగాలికి పోలీసు గుడారం ఎగిరిపోయిన నేపథ్యంలో ఆయన పర్యటించి సిబ్బంది సాదకబాధకాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని తహసీల్దార్‌ భాగ్యలతకు సూచించారు.

Advertisement
Advertisement