‘చేనేతకు చేయూతనందించాలి’ | Sakshi
Sakshi News home page

‘చేనేతకు చేయూతనందించాలి’

Published Mon, Mar 20 2023 1:26 AM

చేనేత వస్త్ర ప్రదర్శనను ప్రారంభిస్తున్న ఆర్‌జేడీ ధనుంజయరావు తదితరులు   - Sakshi

శ్రీకాకుళం (పీఎన్‌ కాలనీ): చేనేత కార్మికులు తయారు చేసే వస్త్రాలను జిల్లా ప్రజలు కొనుగోలు చేసి వారిని ప్రోత్సహించాలని చేనేత, జౌళి శాఖ ప్రాంతీయ ఉపసంచాలకులు బి.ధనుంజయరావు కోరారు. న్యూఢిల్లీ చేనేత జౌళి అభివృద్ధి మంత్రిత్వ శాఖ సౌజన్యంతో జిల్లా చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని టౌన్‌హాల్‌లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను ఆదివారం ప్రారంభించారు. డీపీఆర్‌ఓ కేబీఎం సింగ్‌, చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఐ.ధర్మారావుతో కలిసి జ్యోతి ప్రజ్వల న చేశారు. ఈ సందర్భంగా ఆర్‌జేడీ మాట్లాడుతూ దేశంలో వ్యవసాయం తరువాత అతి పెద్ద వృత్తి చేనేత రంగం అని అన్నారు. చేనేత కార్మికులను ప్రోత్సహించేందుకు కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలుచేస్తున్న సంగతిని ఆయన గుర్తు చేశారు. చేనేత కార్మికులు తయారుచేసే వస్త్రాలకు మార్కెటింగ్‌ ప్రధాన సమస్య అని, ఈ సమస్యను అధిగమించి కార్మికులను ప్రోత్సహించేందుకు దేశవ్యాప్తంగా ఇలాంటి వస్త్ర ప్రదర్శనలను ఏర్పాటు చేసి విక్రయాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. జిల్లా ప్రధాన కేంద్రంలో ఈ నెల 19 నుంచి 25 వరకు వివిధ రాష్ట్రాల వస్త్ర ప్రదర్శనతో పాటు విక్రయాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు ఐ.ధర్మారావు మాట్లాడుతూ ఎనిమిది జిల్లాలకు చెందిన సుమారు 20 సహకార ఉత్పత్తి సంఘాలకు చెందిన అన్ని రకాల వస్త్రాలను ఇక్కడ ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు. వీటి తో పాటు తెలంగాణ రాష్ట్రం వరంగల్‌ జిల్లా నుంచి కూడా వచ్చి ప్రదర్శనలో పాల్గొన్నట్లు తెలిపారు. తక్కువ ధరకే లభించే వస్త్రాలను జిల్లా ప్రజలు స ద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. కా ర్యక్రమంలో ఆప్కో డివిజనల్‌ వాణిజ్యాధికారి సో మేశ్వరరావు, ఆప్కో డీఓ శేఖర్‌, లీలాకుమార్‌, ముఖర్జీ, వివిధ సహకార ఉత్పత్తి విక్రయ సంఘాల అధ్యక్షులు, మేనేజర్లు, సేల్స్‌ మెన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement