మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయం | Sakshi
Sakshi News home page

మత్స్యకారుల సంక్షేమమే ధ్యేయం

Published Sun, Nov 12 2023 12:28 AM

రిజర్వాయర్‌లో చేప పిల్లలను విడిచిపెడుతున్న మంత్రి అప్పలరాజు, ఎమ్మెల్యే రెడ్డిశాంతి  - Sakshi

● మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్యే రెడ్డి శాంతి ● వంశధార రిజర్వాయర్‌లో 5 లక్షల చేప పిల్లల విడుదల

హిరమండలం: మత్స్యకారుల సంక్షేమమే ప్రభు త్వ ధ్యేయమని రాష్ట్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమాభివృద్ధి, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పల రాజు అన్నారు. శనివారం వంశధార రిజర్వాయర్‌లో స్వదేశీ మత్స్యకారుల సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే రెడ్డిశాంతి, జిల్లా మత్స్య శాఖ డైరెక్టర్‌ పి. వి.శ్రీనివాసరావు తో కలిసి ప్రదాన మంత్రి మత్స్య సంపద యోజన ద్వారా సుమారు ఐదు లక్షల చేపపిల్లలను విడిచిపెట్టారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మత్స్యకారులకు లైఫ్‌జాకెట్లు, సబ్సిడీపై మోటార్‌ బోట్లు అందజేస్తున్నట్లు తెలిపారు. మత్స్యకార మహిళలకు అండగా ఫిష్‌ ఆంధ్ర కేంద్రాలను ఏర్పాటు చేయిస్తున్నామన్నారు. ఎమ్మెల్యే రెడ్డిశాంతి మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న అదనపు పరిహారాలను త్వరలో పంపిణీ చేస్తామని, నిర్వాసితులు ఆందోళన చెందవద్దన్నారు. మత్స్యశాఖ డీడీ శ్రీనివాసరావు మాట్లాడుతూ జిల్లాలో 169 చెరువులతో పాటు రిజర్వాయర్‌లో 18 లక్షల పైబడి చేప పిల్లలను విడిచిపెట్టామన్నారు. కార్యక్రమంలో వంశధార ఎస్‌ఈ డోల తిరుమలరావు, ఏడీ సత్యనారాయణ, మత్స్యకార సంఘ జిల్లా అధ్యక్షుడు కోనాడ నర్సింగరావు, ఉపాధ్యక్షులు రామారావు, మురళి, వంశధార ఈఈ ఎం.వి.రమణ, తహశీల్దార్‌ బి.మురళీమోహన్‌, మత్స్యశా ఖ అధికారులు ముసలినాయుడు, రమేష్‌, వైఎస్సార్‌ సీపీ మండల కన్వీనర్‌ మీసాల వెంకటరామకృష్ణ, పీఏసీఎస్‌ అధ్యక్షుడు ఎ.వి.సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement