కొత్తమ్మతల్లి సన్నిధిలో ‘కోటబొమ్మాళి పీఎస్‌’ యూనిట్‌ | Sakshi
Sakshi News home page

కొత్తమ్మతల్లి సన్నిధిలో ‘కోటబొమ్మాళి పీఎస్‌’ యూనిట్‌

Published Sun, Nov 12 2023 12:30 AM

అమ్మవారిని దర్శించుకుంటున్న విజయ్‌, శివానీ  - Sakshi

కోటబొమ్మాళి: శ్రీకాకుళం నగరానికి చెందిన తేజ మార్ని దర్శకత్వంలో తెరకెక్కిన ‘కోటబొమ్మాళి పీఎస్‌’ సినిమా ఈ నెల 24న విడుదల కానున్న నేపథ్యంలో హీరో రాహుల్‌ విజయ్‌, హీరోయిన్‌ శివాని(నటుడు రాజశేఖర్‌ కుమార్తె), నిర్మాత బన్నీ వాసు శనివారం కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఈఓ వి.రాధాకృష్ణ, ఆలయ కమిటీచైర్‌పర్సన్‌ బోయిన మాధవి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సన్నిధిలో పాటలు విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్‌ విలేకరులతో మాట్లాడుతూ జిల్లా రాజకీయాలు, జీవనశైలి, కోటబొమ్మాళి ప్రాంత నేపథ్యంతో సినిమా ఉంటుందన్నారు. సినిమాను ఆదరించాలని కోరారు.

Advertisement
Advertisement