జాతీయ స్విమ్మింగ్‌ పోటీలకు దరహాస్‌ | Sakshi
Sakshi News home page

జాతీయ స్విమ్మింగ్‌ పోటీలకు దరహాస్‌

Published Fri, Nov 17 2023 12:54 AM

రాష్ట్ర స్కూల్‌గేమ్స్‌ పోటీల్లో పతకాలు అందుకుంటున్న దరహాస్‌  - Sakshi

శ్రీకాకుళం న్యూకాలనీ: న్యూఢిల్లీలో త్వరలో జరగనున్న జాతీయస్థాయి స్కూల్‌గేమ్స్‌ అండర్‌–19 బాలబాలికల స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు శ్రీకాకుళం నగరానికి చెందిన వేమకోటి ధనుష్య దరహాస్‌ ఎంపికయ్యాడు. తిరుపతి వేదికగా నవంబర్‌ 9 నుంచి 11 వరకు జరిగిన రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌ అండర్‌–19 బాలబాలికల స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌–2023 పోటీల్లో మూడు పతకాలు సాధించి శభాష్‌ అనిపించాడు. రాష్ట్ర పోటీల్లో 50 మీటర్ల ఫ్రీస్టైల్‌, 50మీటర్ల బటర్‌ఫ్‌లై విభాగాల్లో బంగారు పతకాలు, 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో రజత పతకాలు సాధించి మెరిశాడు. దరహాస్‌ శ్రీకాకుళం ఇల్లీసుపురం సమీపంలోని శ్రీచైతన్య జూనియర్‌ కాలేజ్‌ ఐఐటీ క్యాంపస్‌లో ఇంటర్మీడియెట్‌ సెకెండియర్‌ చదువుతున్నాడు. ఈ సందర్భంగా దరహాస్‌ను ఏజీఎం నర్సునాయుడు, డీన్‌ మురళీధర్‌, ప్రిన్సిపాల్‌ రామకృష్ణ, ఎస్‌జీఎఫ్‌ సెక్రటరీ బి.వి.రమణ, డీఎస్‌ఏ చీఫ్‌ కోచ్‌ కె.శ్రీధర్‌రావు, స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ హారికాప్రసాద్‌, ఎస్‌.కాంతారావు, మురళీధర్‌, కోచ్‌లు, సిబ్బంది అభినందించారు.

Advertisement
Advertisement