ఆర్టీసీ బస్సుల్లో గిఫ్ట్‌ స్కీం | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సుల్లో గిఫ్ట్‌ స్కీం

Published Fri, Nov 17 2023 12:54 AM

బస్సులో గిఫ్ట్‌ బాక్స్‌ ఏర్పాటు చేసిన దృశ్యం  - Sakshi

శ్రీకాకుళం అర్బన్‌: శ్రీకాకుళం ఒకటి, రెండు డిపోల పరిధిలో పలు రూట్లలో తిరిగే ఆర్టీసీ బస్సుల్లో గిఫ్ట్‌ స్కీం ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్లు పి.మల్లికార్జునరాజు, కె.ఆర్‌.ఎస్‌.శర్మ తెలిపారు. ఈ మేరకు శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో గురువారం ఆమదాలవలస బస్సులో గిఫ్ట్‌ స్కీం బాక్స్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆమదాలవలస, బందరువానిపేట, చీపురుపల్లి, సాలూరు, శ్రీముఖలింగం, గుత్తావల్లి, యరగాం, విజయనగరం తదితర మార్గాల్లో ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేసే వారు గమ్యస్థానంలో దిగే ముందు టికెట్‌ వెనుక పేరు, ఫోన్‌ నంబర్‌ రాసి బస్సులో ఏర్పాటు చేసిన గిఫ్ట్‌ బాక్స్‌లో వేయాలని కోరారు. ప్రతి నెలా 3, 17వ తేదీల్లో డ్రా తీసి విజేతలకు జీఎన్‌వీ జ్యువలెర్స్‌(శ్రీకాకుళం) సౌజన్యంతో ఆకర్షణీయమైన బహుమతులు అందజేస్తామని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ మేనేజర్లు వి.రమేష్‌, ఎ.గంగరాజు, ఎస్‌ఎం కె.నరేంద్ర, టీఐ–3 ఎల్‌ఎస్‌ నాయుడు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
Advertisement