ప్రతిభకు నిదర్శనం | Sakshi
Sakshi News home page

ప్రతిభకు నిదర్శనం

Published Sun, Nov 19 2023 12:48 AM

- - Sakshi

ప్రాజెక్టుల

ప్రదర్శన..

టెక్కలి: విద్యార్థుల విజ్ఞానం అబ్బురపరిచింది. ప్రాథమిక స్థాయి నుంచి ప్రతి విద్యార్థి వైజ్ఞానిక ఆలోచనలు కలిగి ఉండాలని జిల్లా విద్యా శాఖాధికారి వెంకటేశ్వరరావు ఆకాంక్షించారు. టెక్కలిలో శనివారం నిర్వహించిన 31వ జాతీయ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లా ప్రాజెక్టుల ప్రదర్శన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 160 పాఠశాలల నుంచి 180 ప్రాజెక్టుల వివరాలతో విద్యార్థులు హాజరయ్యారు. చివరగా 7 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి సైన్స్‌ ప్రదర్శనలకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా విశ్రాంత ఉప విద్యా శాఖాధికారి కె.అప్పారావు నేతృత్వంలో ఆయన భార్య రామలక్ష్మి జ్ఞాపకార్థం విద్యార్థులకు మెమోంటోలు అందజేశారు. కార్యక్రమంలో టెక్కలి ఉప విద్యా శాఖాధికారి జి.పగడాలమ్మ, జిల్లా సైన్సు అధికారి ఎం.కుమారస్వామి, కె.తిరుమలచైతన్య, నిర్వాహక ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి పోటీలు ఈ నెల 29, 30 తేదీల్లో విజయవాడలో జరుగుతాయి.

ఆలోచింపజేసిన 31వ బాలల సైన్స్‌ కాంగ్రెస్‌ జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనలు

జిల్లా వ్యాప్తంగా 180 ప్రాజెక్టుల ప్రదర్శన

రాష్ట్ర స్థాయికి ఎంపికై న 7 ప్రాజెక్టులు

Advertisement
Advertisement