తిరువీధిగా వచ్చి... | Sakshi
Sakshi News home page

తిరువీధిగా వచ్చి...

Published Sat, Nov 25 2023 12:18 AM

తిరువీధిలో జెడ్పీ చైర్‌ పర్సన్‌ పిరియా విజయ తదితరులు - Sakshi

అరసవల్లి: ప్రఖ్యాత అరసవల్లి క్షేత్రంలో శుక్రవారం సాయంత్రం ఆదిత్యుని తెప్పోత్సవం వైభవంగా జరిగింది. క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినం సందర్భంగా హంస వాహనంపై సూర్యనారాయణ స్వామి సతీసమేతంగా పవిత్ర ఇంద్రపుష్కరిణిలో 12 సార్లు విహరించారు. వేలాది మంది భక్తులు ఈ వేడుక చూసేందుకు తరలివచ్చారు. క్షేత్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తెప్పోత్సవానికి ఏర్పాట్లు చేశారు. మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆదేశాల మేరకు పాలకమండలి ప్రత్యేకంగా దృష్టి సారించడంతో ఆలయ ఈఓ వి.హరిసూర్యప్రకాష్‌ దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు, అలంకరణలు అన్నీ ఆకట్టుకున్నాయి. పుష్పాలంకరణ, బాణసంచా వెలుగులతో ఆలయ ప్రాంగణమంతా మెరిసిపోయింది. అలాగే శుక్రవారం ఉద యం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు గర్భాలయంలో ఆదిత్యుడు స్వర్ణాలంకరణలో దర్శనమివ్వడంతో భక్తులు తిలకించి పులకించారు.

తిరువీధిగా వచ్చి...

శుక్రవారం సాయంత్రం 4.15 గంటల సమయానికే ఆలయంలోపల నుంచి వెండి సింహ వాహనంపై ఉషా పద్మిని ఛాయా దేవేరులతో సూర్యనారాయణ స్వామి ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు తీసుకువచ్చి హంస వాహనంలో వేంచింపజేశారు. ముందుగా ఆలయ ప్రధానార్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు ముందుగా గంగా పూజ నిర్వహించి హారతినిచ్చారు. దాదాపు రెండు గంటల పాటు సాగిన క్రతువును భక్తులు తన్మయులై వీక్షించారు. విహారం అనంతరం వెండి సింహవాహనంపై ఉత్సవమూర్తులన మాఢ వీధుల్లో ఊరేగించి ఆలయానికి తీసుకెళ్లారు. అనివెట్టి మండపంలో ద్వాదశి వ్రతం చేశారు.

పుష్కరిణిలో కార్తీక దీపాల సందడి

పుష్కరిణి పరిసరాల్లో పెద్ద సంఖ్యలో మహిళలు ప్రత్యేక దీపారాధన చేశారు. అరటి డొప్పల్లో కార్తీక దీపాలను వెలిగించి పుష్కరిణిలో విడిచిపెట్టారు. ఆలయ ఆవరణలో కాజీపేటకు చెందిన శ్రీసీతారామ నాట్య కళామండలి ఆధ్వర్యంలో కోలాటం, చెక్క భజనల బృంద పాటలుతో పాటు సుమిత్ర కళాసమితి ఆధ్వర్యంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పిరియా విజయ, పాలకమండలి సభ్యురాలు మండవల్లి రవి, డాక్టర్‌ కొంచాడ సోమేశ్వరరావు,

ఇంద్ర పుష్కరిణిలో కార్తీక దీపారాధన
1/1

ఇంద్ర పుష్కరిణిలో కార్తీక దీపారాధన

Advertisement

తప్పక చదవండి

Advertisement