సంక్షేమ పథం | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథం

Published Sat, Nov 25 2023 12:18 AM

- - Sakshi

స్కూల్స్‌ బాగు పడ్డాయి

ఇంటికి యజమానులయ్యాం

మేము మధ్య తరగతికి చెందిన వాళ్లం. సొంతంగా ఇల్లు కట్టుకోలేక అనేక ఇబ్బందులు పడ్డాం. అద్దె ఇంట్లో ఉంటూ వచ్చాం. టీడీపీ హయాంలో అనేక మార్లు పక్కా ఇంటి కోసం దరఖాస్తు చేశాం. సొంత స్థలం ఉంటేనే ఇస్తామన్నారు. మాకేమో సొంత స్థలం లేదు. ఈ దశలో వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడంతో జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి స్థలం ఇచ్చి మాకు ఇల్లు మంజూరు చేశారు. పొదుపు లోన్లు ఇప్పించారు. ఇప్పుడు సొంతంగా ఇల్లు కట్టుకుని యజమానులయ్యాం. అద్దె బాధలు తప్పాయి. ఆనందంగా కుటుంబంతో ఉంటున్నాం. మా ఆనందానికి కారణం జగనన్నే.

– తుంగాన రమణమ్మ, బడ్డవానిపేట,

నరసన్నపేట

తంలో గొట్టిపల్లి స్కూలు పరిస్థితి దారుణంగా ఉండేది. కనీస సౌకర్యాలు ఉండేవి కాదు. భవనాల కొరత వెంటాడేది. ఇప్పుడు నాడు–నేడులో ప్రభుత్వం స్కూల్‌ను అభివృద్ధి చేసింది. స్కూల్‌ మౌలిక వసతులు కల్పించారు. కార్పొరేట్‌కు దీటుగా స్కూల్‌లో సదుపాయాలు ఉన్నాయి. ఈ ఒక్క స్కూల్‌కు రూ.17 లక్షలు వెచ్చించారు. అప్పట్లో విద్యార్థులు 30 మందే ఉండేవారు. ఇప్పుడు 40 మంది వస్తున్నారు. విద్యార్థులకు తరగతుల బోధన కూడా బాగుంది. మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలు చేస్తున్నారు. అటు విద్యార్థులు, ఇటు వారి తల్లిదండ్రులు ఆనందంగా ఉన్నారు. ఉపాధ్యాయులుగా మాకూ గర్వంగా ఉంది

– హెచ్‌.ఆనందరావు, హెచ్‌ఎం, గొట్టిపల్లి

1/3

2/3

3/3

Advertisement

తప్పక చదవండి

Advertisement