‘దీక్ష’గా పతకాల పంట | Sakshi
Sakshi News home page

‘దీక్ష’గా పతకాల పంట

Published Sat, Dec 23 2023 4:30 AM

మూడు పతకాలు సాధించిన దీక్షా బెహరాను అభినందిస్తున్న కేవీ ప్రిన్సిపాల్‌ షోయబ్‌ ఆలం  - Sakshi

శ్రీకాకుళం న్యూకాలనీ: ఈత పోటీల్లో దీక్షా బెహరా చరిత్ర సృష్టించింది. స్కూల్‌గేమ్స్‌ చరిత్రలో అండర్‌–14 విభాగంలో మూడు బంగారు పతకాలు సాధించి శభాష్‌ అనిపించి నేరుగా జాతీయ పోటీలకు ఎంపికై ంది. 67వ ఏపీ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్‌ అండర్‌–14 బాలబాలికల స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌–2023 పోటీలు ఈనెల 18 నుంచి 20వ తేదీ వరకు విజయవాడ వేదికగా జరిగాయి. ఈ పోటీల్లో శ్రీకాకుళం జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహించిన దీక్షా బెహరా మూడు బంగారు పతకాలతో సంచలనం సృష్టించింది. 50 మీటర్ల బ్రెస్ట్‌ స్ట్రోక్‌, 50మీటర్ల బ్యాక్‌ స్ట్రోక్‌, 100మీటర్ల బ్రెస్ట్‌ స్ట్రోక్‌ ఈవెంట్స్‌లో పతకాల పంట పండించింది. దీంతో 2024 జనవరి 3 నుంచి 9వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరిగే ఆలిండియా స్కూల్‌గేమ్స్‌ బాలబాలికల స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు ఎంపికై ంది.

శ్రీకాకుళం సమీపంలోని పాత్రునివలసలో నివా సం ఉంటున్న మండల యుగంధర్‌, బసంతి బెహ రాల కుమార్తె దీక్షా బెహరా. తండ్రి మెకానిక్‌గా పనిచేస్తుండగా, తల్లి గృహిణి. దీక్ష ఇప్పుడు శ్రీకాకుళంలోని కేంద్రీయ విద్యాలయంలో 8వ తరగతి చదువుతోంది. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో గత ఐదారేళ్లుగా స్విమ్మింగ్‌లో అనేక జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తాచాటుతూ వస్తోంది. చదువుల్లోనూ రాణిస్తోంది. దీక్ష జాతీయ పోటీలకు ఎంపిక కావడంపై కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్‌ షోయబ్‌ ఆలం, పీడీ సుందరరావు, డీఎస్‌డీఓ డాక్ట ర్‌ శ్రీధర్‌రావు, ఎస్‌జీఎఫ్‌ కార్యదర్శి బీవీ రమణ, క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement