నేడు రంగోయిలో గిరిధర గొమాంగో జుగల్‌బందీ | Sakshi
Sakshi News home page

నేడు రంగోయిలో గిరిధర గొమాంగో జుగల్‌బందీ

Published Sun, Jan 7 2024 12:34 AM

-

పలాస : మండలంలోని రంగోయి గ్రామంలో ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, ప్రముఖ డప్పు కళాకా రుడు గిరిధర గొమాంగో జుగల్‌ బందీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గిడుగు రామ్మూర్తి తెలుగు భాషా జాన పద కళాపీఠం వ్యవస్థాపక అధ్యక్షుడు, జానపద పరిశోధకుడు బద్రి కూర్మారావు చెప్పారు. శనివారం రంగోయిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ తన తండ్రి బద్రి అప్పన్న పేరిట 20 ఏళ్ల క్రితం 2004లో కళాపీఠం ఏర్పాటు చేశామని, అప్పటి నుంచి ఏటా జానపద కళాకారులను రంగోయి గ్రామానికి సంక్రాంతి సందర్భంగా ఆహ్వానించి వారి ఆట పాటలను సమాజానికి పరిచయం చేస్తున్నామని చెప్పారు. పేద కళాకారులకు పింఛన్లు అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ఆదివారం ఉదయం 10గంటల నుంచి జానపద జాతర ప్రారంభమవుతుందన్నారు. హైదరాబాద్‌కు చెందిన వైఎస్సార్‌ జీవన సాఫల్య పురస్కార గ్రహీత డాక్టర్‌ చిగిచర్ల కృష్ణారెడ్డి, అంతర్జాతీయ నృత్య కళాకారిణి నిర్మలా నృత్యనికేతన్‌, రాయలసీమ జానపద గాయకురాలు అనంత ఆణిముత్యం, ప్రవాసాంధ్ర గాయకులు, కళింగ సీమ సాహిత్య సంస్థ అధ్యక్షుడు సన్నశెట్టి రాజశేఖర్‌ తదితరులు హాజరై తమ ఆటపాటలతో అలరించనున్నారని వివరించారు.

Advertisement
Advertisement