బీసీ వర్గాల అభ్యున్నతికి కృషి | Sakshi
Sakshi News home page

బీసీ వర్గాల అభ్యున్నతికి కృషి

Published Fri, Apr 19 2024 1:30 AM

మాట్లాడుతున్న మంత్రి ధర్మాన ప్రసాదరావు  - Sakshi

గార: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనలో బీసీ వర్గాల అభ్యన్నతికి కృషి చేశామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. గార మండలం శిమ్మపేట జంక్షన్‌లోని కల్యాణ మండపంలో గురువారం పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాదయాత్రలో పేదలకు ఏ హామీలు ఇచ్చామని, వాటినే మేనిఫెస్టోలో రూపొందించి 99 శాతం అమలు చేశామని చెప్పారు. బీసీ వర్గాలకు రాజికీయంగా అనేక నామినేటడ్‌ పదవులు ఇవ్వడంతో పాటు పలు కార్పొరేషన్లు ఏర్పాటు చేశామన్నారు. బీసీల ఓట్లు వేయించుకున్న టీడీపీ వారి అభ్యన్నతికి ఏం చేసిందని ప్రశ్నించారు. బీసీలను వాడుకొని వదిలేసిన మనస్తత్వం చంద్రబాబుదని ధ్వజమెత్తారు. ప్రజల్లో తారతమ్యాలు ఉండకూడదనే ఉద్దేశంతో విద్యారంగానికి అధిక ప్రాధాన్యమిస్తున్నామని చెప్పారు. పిల్లల బాగు కోసం తల్లి, తండ్రి ఎలా ఆలోచిస్తున్నారో ఈ ప్రభుత్వం కూడా అలాగే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటుందన్నారు. జన్మభూమి కమిటీ అనే బ్రోకర్ల ప్రభుత్వం కావాలా.. పేదల సంక్షేమానికి కృషి చేసే వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం కావాలో మీరే నిర్ణయించుకోవాలన్నారు. చంద్రబాబు హామీలను నమ్మవద్దన్నారు. కార్యక్రమంలో శ్రీశయన కార్పొరేషన్‌ చైర్మన్‌ డీపీ దేవ్‌, సర్పంచ్‌ గొలివి వెంకటరమణమూర్తి, అంబటి చినబాబు, ఎంపీపీ గొండు రఘురామ్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ గొండు కృష్ణమూర్తి, పార్టీ కన్వీనర్‌ పీస గోపి, ముంజేటి కృష్ణమూర్తి, అరవల రామకృష్ణ, బరాటం నాగేశ్వరరావు, శిమ్మ ధర్మరాజు, యాళ్ల నారాయణమూర్తి, కొయ్యాన చిన్నంనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement