No Headline | Sakshi
Sakshi News home page

No Headline

Published Fri, Apr 19 2024 1:30 AM

- - Sakshi

ఆరోగ్య శ్రీ.. ఇది కేవలం ప్రభుత్వ పథకం కాదు. రాత్రి వేళ నాలుగు మెతుకులు తింటూ రేపటికి తిండి ఎలారా దేవుడా అని మదన పడే సామాన్యుడికి ఆత్మీయ నేస్తం. నెలాఖరున బిడ్డకు సుస్తీ చేస్తే నిస్సహాయంగా ఖాళీ పర్సును తడిమి చూసుకునే మధ్య తరగతి మనిషి పాలిట అమృత హస్తం. పొరపాటున పెద్ద జబ్బేదో వస్తే రోగి కంటే ఎక్కువగా యాతన అనుభవించే ఆ ఇంటి పెద్దకు తోడుగా నిలిచే ఆత్మ బంధువు. పేదవాడిది కూడా ప్రాణమేనని, ఆ ప్రాణానికి బాధ్యత తీసుకునే ప్రభుత్వం మీకు ఉందని నిరంతరం గుర్తు చేసే సాధనం. ఈ కార్డు ముక్క ఇంటిలో కనిపిస్తే.. సగటు జీవికి అదో ధైర్యం. ఆ కార్డులో కుటుంబ సభ్యుల పేర్లు కనిపిస్తే నిరుపేదకు అదో భరోసా.

– అరసవల్లి/ఎచ్చెర్ల క్యాంపస్‌/టెక్కలి/నరసన్నపేట/ఇచ్ఛాపురం రూరల్‌

ప్రజల మనసులో శాశ్వత స్థానం సంపాదించుకున్న ఆరోగ్య శ్రీ

జిల్లాలో లక్షలాది మంది ప్రాణాలను కాపాడిన పథకం

● 2019 నుంచి నేటి వరకు 2.68 లక్షల మందికి శస్త్రచికిత్సలు

ఐదేళ్లలో రూ.569 కోట్లు ఖర్చు చేసిన

రాష్ట్ర ప్రభుత్వం

స్తులన్నీ ఆస్పత్రులకు ఖర్చయిపోగా ఆఖరకు ఆప్తులను కూడా పోగొట్టుకున్న వారెందరో. అసలు ఆస్పత్రికి వెళ్లాలనే ఆలోచన కూడా చేయకుండా ఇంటిలోనే ఊపిరి వదిలేసిన వారు ఇంకెందరో. ఇలాంటి గడ్డు పరిస్థితుల గురించి తెలుసుకుని పేదల ప్రాణాలకు రక్షణగా అప్పట్లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి ప్రవేశ పెట్టిన మహత్తర పథకం ఆరోగ్య శ్రీ. తండ్రి ఒక అడుగు ముందుకు వేస్తే.. తనయుడు మరో పది అడుగులు ముందుకు వేశా రు. తండ్రి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పరిధిని పెంచుతూ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని మరింత మందికి చేరవ చేశారు. ఈ పథకం పరిధిలోకి ఏకంగా 3,257 జబ్బులను చేర్చడంతో పాటు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీ పరిధిని ఏకంగా రూ.25 లక్షల వరకు పెంచుతూ స్మార్ట్‌ కార్డులను పంపిణీ చేస్తోంది. దీంతో పేద,సామాన్య వర్గాలకు ఆరోగ్య బెంగ తీరిపోయింది. అలాగే గుండెజబ్బుతో పాటు క్యాన్సర్‌ వంటి అతిపెద్ద జబ్బులను సైతం ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకువచ్చింది. గతంలో ఈ ఆరోగ్యశ్రీ పరిధిలో 1,059 ప్రొసీజర్స్‌ ఉండగా, ఇప్పుడు ఏకంగా 3,257 వ్యాధులను (ప్రొసీజర్స్‌) ఈ పరిధిలోకి తీసుకొచ్చారు. వెయ్యి రూపాయలు దాటిన ప్రతి ప్రొసీజర్‌ను ఉచితంగా చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. 2019 నుంచి ఇప్పటివరకు ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో 2.68 లక్షల మందికి వివిధ రకాల శస్త్ర చికిత్సలు చేయగా..రూ.569 కోట్లకు పైగా ఖర్చు భరించి ఆరోగ్యశ్రీ ద్వారానే సేవలందించారు.

ఆరోగ్యశ్రీ స్మార్ట్‌ కార్డుల పంపిణీ పూర్తి

ఆరోగ్యశ్రీ పథకంపై క్షేత్ర స్థాయిలో అవగాహన పెరగాలనే సదుద్దేశంతో ఆరోగ్యశ్రీని ప్రత్యేకంగా యాప్‌ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్‌ కార్డుల పంపిణీని కొద్ది నెలల క్రితమే ప్రారంభించింది. జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రజల సొంత ఆండ్రాయిడ్‌ ఫోన్లలో ఈ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయించి, ఎలా వినియోగించాలో ఇప్పటికే ఇంటింటి డ్రైవ్‌లో ప్రజలకు వైద్య సిబ్బంది వివరించారు. మొత్తం 6,39,427 స్మార్ట్‌ కార్డుల పంపిణీ లక్ష్యాన్ని పూర్తి చేశారు.

ఆరోగ్యశ్రీ

ఆదుకుంది...

టెక్కలి గొల్లవీధికి చెందిన ఈదు చిన్నంనాయుడు గత ఏడాది అక్టోబర్‌ నెలలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. రెండు కాళ్లతో పాటు నడుము కింద భాగం దెబ్బతింది. ముందు రిమ్స్‌కు తీసుకెళ్లి అక్కడి నుంచి జెమ్స్‌కు పంపించారు. అక్కడ ఆరోగ్యశ్రీ పథకం వర్తింపజేస్తూ నవంబర్‌ నెలలో ఆపరేషన్‌ చేశారు. లక్ష రూపాయలకు పైగా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా సాయం అందింది. ప్రస్తుతానికి ఇంటి వద్ద కోలుకుంటున్నారు.

ఈ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ సేవలు

ఏడాది జరిగిన ఖర్చు చేసిన

శస్త్రచికిత్సలు మొత్తం

2019–20 33,312 రూ. 84.40 కోట్లు

2020–21 35,185 రూ. 95.08 కోట్లు

2021–22 61,357 రూ. 145.16 కోట్లు

2022–23 74,206 రూ. 106.45 కోట్లు

2023–24

(ఏప్రిల్‌1వరకు) 64,829 రూ. 138.68 కోట్లు

మొత్తం 2,68,889 రూ. 569.77 కోట్లు

Advertisement
Advertisement