దుకాణదారుడిపై చేయి చేసుకున్న వ్యక్తిపై కేసు | Sakshi
Sakshi News home page

దుకాణదారుడిపై చేయి చేసుకున్న వ్యక్తిపై కేసు

Published Sun, Sep 24 2023 1:46 AM

-

హుజూర్‌నగర్‌ : బేకరీ దుకాణదారుడిపై చేయి చేసుకున్న వ్యక్తిపై హుజూర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. హుజూర్‌నగర్‌ పట్టణంలోని మిర్యాగూడ రోడ్డులో గల ఫేమస్‌ బేకరీలోకి శనివారం ప్రదీప్‌రెడ్డి ప్రవేశించాడు. దౌర్జన్యంగా చాక్లెట్‌ తీసుకున్నాడు. దుకాణదారుడు డబ్బులు అడగడంతో ఏందిరా నన్నే డబ్బులు అడుగుతావా అంటూ దుర్భాషలాడి అతనిపై చేయి చేసుకుని వెళ్లిపోయాడు. ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాలో రికార్డు అయ్యింది. అనంతరం దుకాణం యజమాని జాసిద్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాసరెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement