తగ్గిన భూపాల్‌రెడ్డి ఆస్తులు, అప్పులు | Sakshi
Sakshi News home page

తగ్గిన భూపాల్‌రెడ్డి ఆస్తులు, అప్పులు

Published Fri, Nov 10 2023 4:52 AM

-

నల్లగొండ : నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆస్తులతో పాటు అప్పులు కూడా తగ్గాయి. 2018 ఎన్నికల్లో చరాస్తులు రూ.1,57,11,230 ఉండగా.. స్థిరాస్తులు రూ.30.60 కోట్లు ఉన్నాయి. మొత్తం కలిపి రూ.32,17,11,230 ఆస్తులు, రూ.3 కోట్ల అప్పు ఉన్నట్లుగా 2018 ఎన్నికల సమయంలో కంచర్ల భూపాల్‌రెడ్డి తన అఫిడవిట్‌లో చూపించారు. 2023 ఎన్నికల సందర్భంగా గురువారం ఆయన తన అఫిడవిట్‌లో చరాస్తులు రూ.75,53,286, స్థిరాస్తులు రూ.19 కోట్లు.. మొత్తం కలిపి రూ.19,75,53,286 ఆస్తులను చూపించారు. అప్పలు రూ.58,17,299 ఉన్టన్లు వెల్లడించారు. అంటే గత ఎన్నికలతో పోలిస్తే ఆస్తి తగ్గిపోవడంతో పాటు అప్పు కూడా తగ్గిపోయింది. 32 కోట్ల నుంచి 19 కోట్లకు ఆస్తులు తగ్గిపోయాయి. అయితే ఆయన పేరు మీద ఒక కారుతో పాటు వ్యవసాయ భూమి, ఇతర ఇళ్ల స్థలాలు, ఇల్లు ఉన్నట్లుగా చూపించారు.

భగత్‌ చేతిలో నగదు రూ.10 వేలు మాత్రమే..

నిడమనూరు : నాగార్జునసాగర్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి నోముల భగత్‌ చేతిలో ప్రస్తుతం రూ.10 వేలు మాత్రమే ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్‌లో చూపించారు. ఆయన సతీమణి భవాని చేతిలో రూ.15 వేలు ఉన్నట్లు వెల్లగించారు. ఆయన స్థిరాస్తుల విలువ రూ.3,11,70,000 అప్పులు రూ.1,48,73,318 ఉన్నాయి. ఆయన సతీమణి పేరున స్థిరాస్తులు రూ.5,68,750 ఉండగా, అప్పులు రూ.75 లక్షలు ఉన్నట్లు వెల్లడించారు. ఆయన కుమారుడి పేరున చరాస్తి రూ.1.20 లక్షలు, కుమార్తె పేరున రూ.6 లక్షల స్థిరాస్తి, రూ.21,60,000 విలువైన చరాస్తి ఉన్నట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement