రూ.3.43లక్షల నగదు, మద్యం సీజ్‌ | Sakshi
Sakshi News home page

రూ.3.43లక్షల నగదు, మద్యం సీజ్‌

Published Fri, Nov 17 2023 1:48 AM

మద్యం బాటిళ్లు చూపుతున్న అధికారులు - Sakshi

హుజూర్‌నగర్‌ : హుజూర్‌నగర్‌ ఎకై ్సజ్‌, సూర్యాపేట జిల్లా టాస్క్‌ఫోర్స్‌, నల్లగొండ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సంయుక్తంగా మూడు రోజులుగా నియోజవర్గంలోని పలు బెల్ట్‌ షాపులపై దాడులు చేసి 235 లిక్కర్‌, 110 బీర్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. సారా సరఫరా చేస్తున్న వారిని అరెస్ట్‌ చేసి కేసులు నమోదు చేశారు. ఈమేరకు గురువారం హుజూర్‌నగర్‌లోని ఎకై ్సజ్‌ కార్యాలయంలో సీఐ నాగార్జునరెడ్డి కేసుల వివరాలను వెల్లడించారు. మఠంపల్లి మండలం అవిరేణి కుంటతండాకు చెందిన బానోతు వేణు,ఽ దారవత్‌ సంతోష్‌లు సారా తరలిస్తుండగా పట్టకుని 30 లీటర్ల సారాతో పాటు మోటార్‌ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. హుజూర్‌నగర్‌ మండలంలోని అమరవరానికి చెందిన గురువారెడ్డి, వీర బాబులు సారా తరలిస్తుండగా 10 లీటర్ల సారాతో పాటు మోటార్‌ సైకిల్‌ను పట్టుకున్నామన్నారు. తండాలు, గ్రామాల్లో సారా విక్రయిస్తున్న 9 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశామని చెప్పారు. నియోజకవర్గ పరిధిలోని అనేక గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి 235 లిక్కర్‌ బాటిళ్లు, 110 బీర్‌ బాటిళ్లును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. లాలితండా, బిల్యానాయక్‌ తండా, కొత్తతండా శివార్లలో పొల్లాల్లో దాచి ఉంచిన 3,900 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేసినట్లు పేర్కొన్నారు.

రూ.3.43లక్షల నగదు, మద్యం సీజ్‌

నల్లగొండ: ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో గురువారం నల్లగొండ జిల్లాలో నిర్వహించిన తనిఖీల్లో రూ.3.43లక్షల నగదుతో పాటు ఇతర విలువైన వస్తువులను సీజ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. రూ.3,32,300 నగదు, రూ.3,150 విలువైన వస్తువులు, రూ.8,552 విలువ చేసే లిక్కర్‌ను పట్టుకున్నట్లు పేర్కొన్నారు.

ఫ 235 లిక్కర్‌, 110 బీర్‌ బాటిళ్లు స్వాధీనం

Advertisement
Advertisement