సౌండ్‌ పెరిగితే కేసే.. | Sakshi
Sakshi News home page

సౌండ్‌ పెరిగితే కేసే..

Published Fri, Nov 17 2023 1:48 AM

- - Sakshi

భువనగిరి : ఎన్నికలు వచ్చాయంటే పార్టీలు ప్రచార రథాలపై మైకులతో మోతమోగిస్తుంటారు. ప్రత్యేకంగా అభ్యర్థులు రూపొందించుకున్న పాటలతో పాటు మీ ఓటు మాకే అంటూ మైకు ద్వారా ప్రచారం చేస్తుంటారు. కానీ, ఎన్నికల సంఘం ఏ మేరకు సౌండ్‌ వినియోగించాలో నిబంధన విధించింది. ఆస్పత్రులు, విద్యాలయాలు, న్యాయస్థానాల వద్ద సౌండ్‌ 40 డెసిబెల్స్‌ నుంచి 50, నివాస ప్రాంతాల్లో 45 నుంచి 50, వాణిజ్య ప్రాంతాల్లో 55 నుంచి 65, పారిశ్రామిక ప్రాంతాల్లో 70 డెసిబెల్స్‌ నుంచి 75 డెసిబెల్స్‌ వరకు సౌండ్‌ ఉండాలని నిబంధన ఉంది. ఈ నిబంధనలను ఉల్లఘిస్తే పర్యావరణ చట్టం ప్రకారం కేసు నమోదు చేసే అవకాశం ఉంది.

ఈవీఎంలలో గుర్తుల కేటాయింపు ఇలా..

భువనగిరి: ఈవీఎంలలో అభ్యర్థులకు గుర్తులు ఎలా కేటాయిస్తారు అంటే.. ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన జాతీయ, రాష్ట్ర పార్టీల అభ్యర్థులను ఈవీఎంలలో మొదట వరుస క్రమంలో కేటాయిస్తారు. రిజిస్టర్‌ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులను ఆ తర్వాత వరుస క్రమంలో కేటాయిస్తారు. నామినేషన్‌ పత్రంలో నమోదు చేసిన పేర్ల తెలుగు అక్షరమాల ప్రకారం అభ్యర్థులు వరుసగా ఉంటారు. రిజిస్టర్‌ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులకు మాత్రం నామినేషన్‌ పత్రంలో ప్రాధాన్యత క్రమంలో వారు కోరుకున్న గుర్తులను రిటర్నింగ్‌ అధికారి కేటాయిస్తారు. ఒకే గుర్తును ఒకరి కంటే ఎక్కువ మంది అభ్యర్థులు ఎంపిక చేసుకుంటే డ్రా తీస్తారు.

1/1

Advertisement
Advertisement