‘కాకి’ సోదరుల మద్దతు ఎవరికి..? | Sakshi
Sakshi News home page

‘కాకి’ సోదరుల మద్దతు ఎవరికి..?

Published Sun, Nov 19 2023 2:00 AM

- - Sakshi

ఆత్మకూర్‌ (ఎస్‌) (సూర్యాపేట) : ఆత్మకూర్‌ (ఎస్‌) మండలంలో కాకి సోదరులకు రాజకీయ చరిత్ర ఉంది. ఇక్కడ ఏ పార్టీ అభ్యర్థి అయినా.. కాకి దయాకర్‌రెడ్డి, కృపాకర్‌రెడ్డి మద్దతు కోరుతారు. తెలంగాణ ఉద్యమంలో కాకి సోదరులు ఆత్మకూర్‌ (ఎస్‌) మండలంలో ఉద్యమాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అనంతరం జరిగిన 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి గెలుపులో భాగస్వాములు అయ్యారు. అయితే అనారోగ్యంతో మూడు సంత్సరాల క్రితం కాకి దయాకర్‌రెడ్డి మృతి చెందారు. కాకి కృపాకర్‌రెడ్డి 2020 వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడిగా కొనసాగారు. తర్వాత రాజకీయంగా దూరంగా ఉంటున్నారు. వారం రోజుల క్రితం దయాకర్‌రెడ్డి తనయుడు జార్జిరెడ్డి విదేశాల నుంచి ఆత్మకూర్‌ వచ్చి తమ అనుచరులతో రాజకీయ భవిష్యత్‌పై సమావేశం నిర్వహించారు. కాగా ఈనెల 30న అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో సూర్యాపేట నియోజకవర్గంలో పోటీ పడుతున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు కాకి సోదరుల మద్దతు పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement