సూర్యాపేటదే తొలి ఫలితం | Sakshi
Sakshi News home page

సూర్యాపేటదే తొలి ఫలితం

Published Sat, Dec 2 2023 1:24 AM

ఓట్ల లెక్కింపు కోసం సూర్యాపేట కొత్త వ్యవసాయ మార్కెట్‌ యార్డులో ఏర్పాటు చేసిన టేబుళ్లు 
 - Sakshi

సూర్యాపేట: అసెంబ్లీ సాధారణ ఎన్నికల పోరులో విజేతలెవరో.. పరాజితులెవరో తేలే సమయం ఆసన్నమైంది. ఆదివారం జరగనున్న ఓట్ల కౌంటింగ్‌కు సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కొత్త వ్యవసాయ మార్కెట్లో గల గోదాముల్లో సూర్యాపేట, కోదాడ, హుజూర్‌నగర్‌, తుంగతుర్తి నాలుగు నియోజకవర్గాల ఓట్లు లెక్కించనున్నారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించి తొలి ఫలితం వెలువడనుంది.

నియోజకవర్గానికి 14 టేబుళ్ల చొప్పున..

ఓట్ల లెక్కింపు కోసం ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఓట్ల లెక్కింపునకు 14 మంది సూపర్‌ వైజర్లుజర్లు, 14 మంది అసిస్టెంట్‌ సూపర్‌వైజర్లు, 14 మంది మైక్రో అబ్జర్వర్లు ఉంటారు. వీరు కాక సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాలకు ఒక జనరల్‌ అబ్జర్వర్‌, కోదాడ, హుజూర్‌నగర్‌ నియోజకవర్గాలకు ఒక జనరల్‌ అబ్జర్వర్‌ను నియమించారు. ఒక్కో నియోజకవర్గానికి ఆర్వో ఉంటారు. ఒక రౌండ్‌ పూర్తయిన తర్వాత ఆర్వో, జనరల్‌ అబ్జర్వర్‌ 14 టేబుళ్లను ర్యాండమ్‌గా చెక్‌ చేస్తారు. వీరిద్దరు పరిశీలించిన తర్వాతే రెండో రౌండ్‌ ఫలితాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. ఒక్కో నియోజకవర్గం ఫలితాలు రౌండ్ల వారీగా బ్లాక్‌ బోర్డు, అలాగే స్క్రీన్‌ మీద డిసే్‌ల్‌ చేస్తారు. ఇక అభ్యర్థితో పాటు 14 టేబుళ్లకు 14 మంది ఏజెంట్లు ఉంటారు. ప్రతి రౌండ్‌ లెక్కింపును వీరు పరిశీలిస్తారు.

20 నిమిషాలకు ఒక రౌండ్‌ పూర్తి..

హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలోని 308 పోలింగ్‌ కేంద్రాలకు 22 రౌండ్లు, కోదాడ కోదాడలోని 296 పోలింగ్‌ కేంద్రాలకు 22, సూర్యాపేటలోని 271 పోలింగ్‌ కేంద్రాలకు 20, తుంగతుర్తిలోని 326 పోలింగ్‌ కేంద్రాలకు 24 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తి కానుంది. ఒక్కో రౌండ్‌ 15 నుంచి 20 నిమిషాల్లో లెక్కింపు పూర్తి అవుతుంది. ముందుగా నియోజకవర్గాల వారీగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు లెక్కిస్తారు. ఆ తర్వాత ఈవీఎంల కౌంటింగ్‌ మొదలవుతుంది. అలాగే పోలింగ్‌ కేంద్రాల్లో ఏదో ఒకటి వీవీప్యాట్‌ స్లిప్పులు కూడా లెక్కిస్తారు. ఒక్కో రౌండ్లో సుమారు 10 వేల నుంచి 12 వేల ఓట్లను లెక్కిస్తారు. ఆ నియోజకవర్గంలోని 14 పోలింగ్‌ స్టేషన్ల ఈవీఎంలలోని ఓట్లు ఒక్క రౌండ్‌కు వస్తాయి. తక్కువగా 20 రౌండ్లు సూర్యాపేట నియోజకవర్గానికి ఉన్నాయి. ఈ నియోజకవర్గ పూర్తి ఫలితం మధ్యాహ్నం 2గంటల వరకు వెలువడనుంది. దీని తరువాత కోదాడ, హుజూర్‌నగర్‌, తుంగతుర్తి ఫలితాలు రానున్నాయి.

రేపే ఓట్ల లెక్కింపు

ఫ ఉదయం 8 గంటలకు ప్రారంభం

ఫ మధ్యాహ్నం 2 గంటల వరకు

పూర్తి ఫలితాల ప్రకటన

ఫ తక్కువ రౌండ్లు ఉన్న సూర్యాపేట తర్వాత మిగతా వాటి రిజల్ట్‌

ఫ కౌటింగ్‌ కోసం ఒక్కో

నియోజకవర్గానికి 14 టేబుళ్లు ఏర్పాటు చేసిన అధికారులు

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

వ్యవసాయ మార్కెట్లో కౌంటింగ్‌ సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. కౌంటింగ్‌ ఎలా చేయాలో ఇప్పటికే అధికారులకు శిక్షణ ఇచ్చాం. ఒక్కో టేబుల్‌ ఓట్ల లెక్కింపునకు నియమించిన అధికారులు ఎలా ప్రక్రియ ప్రారంభించాలో వివరించాం. తుది ఫలితం వెలువడే వరకు రౌండ్ల వారీగా ఫలితాల ప్రకటన అధికారికంగా ప్రకటిస్తాం. అభ్యర్థులు, వారి తరఫున వచ్చే ఏజెట్లకు టేబుళ్ల వద్ద ఎలా ఉండాలో ఇప్పటికే సూచనలిచ్చాం.

– ఎస్‌.వెంకట్రావు,

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌

రౌండ్లు ఇలా..

నియోజకవర్గం రౌండ్లు

హుజూర్‌నగర్‌ 22

కోదాడ 22

సూర్యాపేట 20

తుంగతుర్తి 24

Advertisement
Advertisement