ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి | Sakshi
Sakshi News home page

ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలి

Published Sat, Dec 9 2023 4:38 AM

సమావేశంలో మాట్లాడుతున్న ఎండీ జహంగీర్‌   - Sakshi

మోత్కూరు : కొనుగోలు కేంద్రాల్లో ఇంకా 30 శాతం ధాన్యం మిగిలిపోయిందని, పూర్తి స్థాయిలో కొనుగోలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ జహంగీర్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన మోత్కూరులో విలేకరులతో మాట్లాడారు. నూతన ప్రభుత్వం వాగ్ధానాలు తప్పనిసరిగా అమలు చేయాలని, కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యానికి మద్దతు ధర పెంచాలని కోరారు.సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరు బాలరాజుగౌడ్‌, కల్లూరి మల్లేషం, దాసరి పాండు, జిల్లా కమిటీ సభ్యులు బొల్లు యాదగిరి, మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు, పట్టణ కార్యదర్శి కూరపాటి రాములు, జిల్లా నాయకులు బుర్రు అనిల్‌, నరసింహ తదితరులు పాల్గొన్నారు.

లోక్‌ అదాలత్‌లో కేసుల సత్వర పరిష్కారం

జిల్లా ప్రధాన జడ్జి జయరాజు

భువనగిరి క్రైం : కేసుల సత్వర పరిష్కారానికి లోక్‌ అదాల్‌తలు దోహదపడుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు జయరాజు పేర్కొన్నారు. డిసెంబర్‌ 30న నిర్వహించనున్న లోక్‌ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శుక్రవారం జిల్లా కోర్టులో న్యాయమూర్తులు, పోలీసు అధికారులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లతో నిర్వహించిన జిల్లా కోఆర్డినేషన్‌ సమావేశంలో ఆయన పాల్గొని లోక్‌ అదాలత్‌పై చర్చించారు. రాజీపడదగిన క్రిమినల్‌ కేసులు, చెక్‌బౌన్స్‌, ట్రాఫిక్‌ చలనా, కుటుంబ తగాదాలు, సివిల్‌, బ్యాంక్‌, టెలిఫోన్‌, చిట్‌ఫండ్‌, ప్రిలిటిగేషన్‌ కేసులు పరిష్కరించనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా సివిల్‌, క్రిమినల్‌ కేసులు 4,888, బీఎస్‌ఎన్‌ఎల్‌ 421 కేసులు పరిష్కారానికి వీలైనవిగా గుర్తించినట్లు చెప్పారు. న్యాయమూర్తులు, పోలీసు అధికారులు కేసుల పరిష్కారానికి చొరవచూపాలని కోరారు. డీసీపీ రాజేశ్‌చంద్ర మాట్లాడుతూ రాజీ పడదగిన కేసుల పరిష్కారానికి సంబంధించిన ఇప్పటికే పోలీసు యంత్రాంగానికి సూచనలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి శ్రీమతి మారుతిదేవి, అదనపు సీనియర్‌ సివిల్‌ జడ్జి దశరథ రామయ్య, ప్రధాన జూనియర్‌ సివిల్‌ జడ్జ్‌ నాగేశ్వర్‌రావు, అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కవిత, డీఆర్‌ఓ పద్మజారాణి, ట్రాఫిక్‌ సీఐ మధుసూదన్‌ పాల్గొన్నారు.

సమావేశంలో మాట్లాడుతున్న 
ప్రధాన న్యాయమూర్తి జయరాజు
1/1

సమావేశంలో మాట్లాడుతున్న ప్రధాన న్యాయమూర్తి జయరాజు

Advertisement

తప్పక చదవండి

Advertisement