శ్రీకృష్ణుడిగా.. గోవర్ధనగిరిధారిగా.. | Sakshi
Sakshi News home page

శ్రీకృష్ణుడిగా.. గోవర్ధనగిరిధారిగా..

Published Mon, Dec 25 2023 1:54 AM

శ్రీకృష్ణుడి అలంకార సేవలో స్వామివారిని ఊరేగిస్తున్న ఆచార్యులు, ఈఓ, అనువంశిక ధర్మకర్త - Sakshi

యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో అధ్యయనోత్సవాలు పాంచరాత్ర ఆగమశాస్త్రనుసారంగా రెండవ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం శ్రీస్వామి వారిని శ్రీకృష్ణుడు (వేణుగోపాలస్వామి) అలంకారంలో తీర్చిదిద్దారు. అంతకు ముందు నిత్యారాధనలు చేపట్టి, దివ్య ప్రబంధ పారాయణం పారాయణికులచే గావింపజేశారు. స్వామి వారిని ప్రధానార్చకులు, ఉప ప్రధానార్చకులు, పారాయణికులు, వేద పండితుల మంత్ర పఠనాల నడుమ భాజాభజంత్రీలతో మాఢ వీధుల్లో ఊరేగించారు. అనంతరం అద్దాల మండంలో స్వామివారిని అధిష్టించి పారాయణం చేశారు.

రాత్రి వేళ..

అధ్యయనోత్సవాల్లో భాగంగా సాయంకాలం వేళ ఆలయంలో ద్రావిడ ప్రబంధ సేవా కాలం పారాయణికులచే నిర్వహించారు. అనంతరం శ్రీస్వామిని గోవర్ధనగిరిధారిగా అలంకరించి ఆలయ తిరు, మాఢ వీధుల్లో ఊరేగించారు. మాఢ వీధుల్లో శ్రీస్వామి వారు ఊరేగుతున్న సమయంలో భక్త జనులు కనులారా వీక్షించి, మొక్కుకున్నారు. అనంతరం శ్రీస్వామి వారి అలంకార విశిష్టతను ఆచార్యులు భక్తులకు వివరించారు. ఆయా వేడుకల్లో ఈఓ రామకృష్ణారావు, అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ప్రధానార్చకులు, ఆచార్యులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

భక్తులకు దర్శనమిచ్చిన

లక్ష్మీ నారసింహుడు

వైభవంగా రెండో రోజు అధ్యయనోత్సవాలు

గోవర్ధనగిరిధారి అలంకార సేవను ఊరేగిస్తున్న ఆచార్యులు
1/1

గోవర్ధనగిరిధారి అలంకార సేవను ఊరేగిస్తున్న ఆచార్యులు

Advertisement
Advertisement