చట్టాలపై అవగాహన అవసరం | Sakshi
Sakshi News home page

చట్టాలపై అవగాహన అవసరం

Published Mon, Dec 25 2023 1:54 AM

- - Sakshi

తిరుమలగిరి(నాగార్జునసాగర్‌): చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన అవసరమని సమాచార హక్కు చట్టం ప్రజావేదుల న్యాయ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు కన్నెకంటి క్రాంతి కుమార్‌ అన్నారు. ఆదివారం మండలంలోని ఎర్రచెరువుతండా, నెల్లికల్లు గ్రామాల్లో గిరిజన ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించేందుకు ర్యాలీలు నిర్వహించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో శివశంకర్‌, రామారావు, శ్రీనివాస్‌రెడ్డి, భద్రి, శివరాంప్రసాద్‌, శ్రీనివాస్‌, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.

కార్యకర్తలకు అండగా ఉంటాం

చండూరు : అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై కార్యకర్తలు అధైర్య పడొద్దని, అందరికి అండగా ఉంటామని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం చండూరులోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. మునుగోడు ప్రాంత అభివృద్ధి కోసం రూ.571 కోట్ల నిధులు ఉన్నాయని, ఆ డబ్బులతో అభివృద్ధి చేయాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిని కోరారు. ఈ సమావేశంలో పాల్వాయి స్రవంతి, జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, మున్సిపల్‌ చైర్మన్‌ తోకల చంద్రకళవెంకన్న, పాటల వెంకన్న, కౌన్సిలర్లు కోడి వెంకన్న, అన్నెపర్తి శేఖర్‌, గుంటి వెంకటేశం, మంచుకొండ కీర్తి సంజయ్‌, కొండ్రెడ్డి యాదయ్య, గుర్రం వెంకట్‌రెడ్డి, తేలుకుంట్ల, జానయ్య తదితరులు పాల్గొన్నారు.

ఎంఎస్‌పీ నల్లగొండ అధ్యక్షుడిగా శ్రీనివాస్‌ మాదిగ

నల్లగొండ టౌన్‌: మహాజన సోషలిస్టు పార్టీ (ఎంఎస్‌పీ) జిల్లా అధ్యక్షుడిగా నల్ల గొండ పట్టణానికి చెందిన బకరం శ్రీనివాస్‌ మాదిగ నియమితులయ్యారు. ఆదివారం నల్లగొండలోని అంబేద్కర్‌ భవనంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన కందుకూరి సోమన్న మాదగి సమక్షంలో పార్టీ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధికార ప్రతినిధిగా మడుపు శ్రీనివాస్‌, జిల్లా ఉపాధ్యక్షులుగా పోలేని యాదయ్య, జిల్లా తిరమలేష్‌మాదిగ, జిల్లా ప్రధాన కార్యదర్శులుగా బొజ్జ చిన్నమాదిగ, ఎరసాని గోపాల్‌మాదిగ, జిల్లా కార్యదర్శిగా మారపాక గోపాల్‌, గడుసు సైదేష్‌, జిల్లా సహాయకార్యదర్శులుగా ఏర్పాల వెంకటయ్య, దుబ్బ సత్యనారాయణ, నలగంటి రమేష్‌, జిల్లా ప్రచార కార్యదర్శిగా వంగూరి ప్రసాద్‌, పెరిక లింగస్వామి మాదిగ ఎన్నికయ్యారు.

అవగాహన కల్పిస్తున్న క్రాంతి కుమార్‌
1/1

అవగాహన కల్పిస్తున్న క్రాంతి కుమార్‌

Advertisement
Advertisement