తమిళ సినిమా: ఏకై క సూపర్ స్టార్ రజినీకాంతే అని కన్నడ హీరో ఉపేంద్ర పేర్కొన్నారు. దక్షిణాది చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్న నటుడు ఉపేంద్ర. స్వతహాగా కన్నడిగుడు అయిన ఈయన అక్కడ రియల్ సూపర్ స్టార్‌గా వెలుగొందుతున్నారు. తాజాగా ఈయన కథానాయకుడిగా నటించిన కన్నడ చిత్రం కబ్జా. శ్రీ సిద్ధేశ్వర ఎంటర్‌ప్రైజస్, ఇన్వేనియో ఒరిజిన్ సంస్థల సమర్పణలో ఆర్ చంద్రు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన భారీ చిత్రం ఇది. నటి శ్రీయ కథానాయికగా నటించిన ఇందులో నటి సుధ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. నటుడు కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ అతిథి పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి అలంకార్ పాండియన్ సహ నిర్మాతగా వ్యవహరించారు. నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న చిత్రం ఈ నెల 17వ తేదీ కన్నడ, తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శనివారం సాయంత్రం చైన్నెలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. నటి శ్రీయ మాట్లాడుతూ.. తనకు చైన్నె ఎప్పుడూ స్పెషలేనన్నారు. ఈ చిత్రానికి తనను ఎంపిక చేసిన దర్శకుడు చంద్రుకు కృతజ్ఞతలు తెలిపారు. ఉపేంద్ర వంటి అద్భుతమైన నటుడితో కలిసి తెరపై భాగం పంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. చిత్ర దర్శక నిర్మాత చంద్రు మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని తమిళనాడులో విడుదల చేస్తున్న లైకా ప్రొడక్షన్స్, తమిళ్ కుమరన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర కథానాయకుడు ఉపేంద్ర మాట్లాడుతూ.. చిత్ర ట్రైలర్ చూడగానే ఇది సాంకేతిక నిపుణుల చిత్రమని మీకు తెలుస్తుందన్నారు. దర్శకుడు చంద్రు నాలుగేళ్ల కల అని పేర్కొన్నారు. ఇందులో నటుడు కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ అతిథి పాత్రల్లో నటించారని తెలిపారు. కాగా నటి శ్రీయ మాట్లాడినప్పుడు ఉపేంద్రను ఇండియన్ రియల్ సూపర్ స్టార్ అని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన ఉపేంద్ర తాను కన్నడలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించానని.. అదేవిధంగా రియల్ రౌడీలతో చిత్రం చేయడంతో అందరూ ఇండియన్ రియల్ సూపర్‌స్టార్ అంటుంటారని, నిజానికి రజినీకాంత్ ఒక్కరే సూపర్‌స్టార్ అని పేర్కొన్నారు. కాగా తనకు తమిళంలో చిత్రం చేయాలనే కోరిక ఉందని.. త్వరలోనే అది నెరవేరుతుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
ఏకై క సూపర్‌స్టార్ రజినీకాంతే
Published Mon, Mar 13 2023 2:26 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
సీత్యతండాలో అగ్ని ప్రమాదం
ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి
కాంగ్రెస్, బీఆర్ఎస్ను భూస్థాపితం చేయాలి
Lok sabha elections 2024: ఢిల్లీ గల్లీలు...ఎవరివో!
దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
సరెండర్ చేసినా కుర్చీ వదలరు
బైక్‌తో సహా బావిలో పడి రైతు మృతి
ఎన్నికల్లో కమ్యూనిస్టులే ప్రధాన భూమిక
పర్యావరణ రక్షణకు న్యాయవ్యవస్థ కృషి
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఐదుగురు నామినేషన్లు
తప్పక చదవండి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్‌కప్‌కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్‌గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్‌లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
Advertisement