● ఏడు చోట్ల ముగింపు ● 43 చోట్ల కొనసాగింపు ● కీలక రికార్డులు లభ్యం | Sakshi
Sakshi News home page

● ఏడు చోట్ల ముగింపు ● 43 చోట్ల కొనసాగింపు ● కీలక రికార్డులు లభ్యం

Published Thu, Apr 27 2023 1:36 AM

- - Sakshi

మూడో రోజూ

జీ స్క్వేర్‌లో విచారణ

సాక్షి, చైన్నె: ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్క్వేర్‌లో మూడో రోజూ బుధవారం కూడా విచారణ కొనసాగింది. ఏడు చోట్ల సోదాలు ముగించారు. 43 చోట్ల కొనసాగిస్తున్నారు. ఈ సంస్థ గత మూడేళ్ల కాలంలో ఆదాయపరంగా అపార ప్రగతిని సాఽధించడమే కాకుండా, పన్ను ఎగవేతకు సంబంధించిన కీలక రికార్డులు ఈ సోదాల్లో బయటపడ్డట్టు సమాచారం. డీఎంకే కుటుంబీలకు చెందిన సంస్థగా ప్రచారంలో ఉన్న జీ స్క్వేర్‌లో సోమవారం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్న విషయం తెలిసిందే. చైన్నె, కోయంబత్తూరు, తిరుచ్చిలతో పాటు 50 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. ఏడు చోట్ల మాత్రం తనిఖీలను ముగించారు. మరో 43 చోట్ట సోదాలు కొనసాగుతున్నాయి. ఇందులో డీఎంకే ఎమ్మెల్యే మోహన్‌, ఆయన కుమారుడు కార్తీ నివాసాలు, కార్యాలయాలు కూడా ఉన్నాయి. అలాగే, జీస్క్వేర్‌ ముఖ్య నిర్వాహకులు, ఆడిటర్‌ షణ్ముగరాజ్‌ నివాసం, కార్యాలయాల్లో, కోయంబత్తూరులోని కార్యాలయం, మహేంద్ర పంప్స్‌ యాజమాన్యం నివాసంలోనూ తనిఖీల్లో ఐటీ వర్గాలు నిమగ్నమయ్యాయి. మూడేళ్లల్లో ఈ సంస్థ ఆదాయపరంగా అపార ప్రగతిని సాధించినట్టు తేలింది. ఇంత పెద్ద మొత్తంలో ఆదాయం ఎలా వచ్చిందో అని నిర్వాహకుల వద్ద విచారిస్తున్నాయి. చెట్టినాడు గ్రూప్‌ సంస్థలలోనూ మూడోరోజూ ఈడీ సోదాలు కొనసాగాయి. ఎగ్మూర్‌, అన్నా సాలైలలోని కార్యాలయాలలో సోదాలతోపాటు అక్కడి అధికారులను ఈడీ వర్గాలు విచారిస్తున్నాయి.

Advertisement
Advertisement