ప్లస్‌–2 ఫలితాల్లో రాణిపేట జిల్లా లాస్ట్‌ | Sakshi
Sakshi News home page

ప్లస్‌–2 ఫలితాల్లో రాణిపేట జిల్లా లాస్ట్‌

Published Tue, May 9 2023 1:34 AM

సెల్‌లో ఫలితాలను చూసుకుంటూ..  - Sakshi

కావేరి ఆస్పత్రి

కొత్త బ్రాంచ్‌ ప్రారంభం

సాక్షి, చైన్నె: నగరంలో నాణ్యమైన వైద్యసేవలందిస్తున్న కావేరి ఆసుపత్రుల గ్రూపు నిర్వాహకులు కోవిలంబాక్కంలోని సోమవారం ఉదయం కొత్త హాస్పిటల్‌కు శ్రీకారం చుట్టారు. ఈ ఆసుపత్రిని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రారంభించారు. 250 పడకల సదుపాయంతో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా ఈ ఆసుపత్రి మెరుగైన సేవలందిస్తుందని కావేరి హాస్పిటల్స్‌ చైర్మన్‌ డాక్టర్‌ చంద్రక మార్‌ తెలిపారు. కేథ్యాబ్‌, 3–టెల్సా ఎంఆర్‌ఎస్‌ఐ, 128 స్లైస్‌ సీటీ తదితర స్కానింగ్‌ పరికరాలు కూడా ఈ ఆసుపత్రిలో ఉన్నాయని చెప్పారు. ఈ ఆసుపత్రి ప్రారంభోత్సవ వేడుకల్లో మంత్రి దామో అనర్బరసన్‌, కావేరి ఆసుపత్రి ఎండీ డాక్టర్‌ ఎస్‌ మణివన్నన్‌, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అరవిందన్‌ సెల్వరాజ్‌ తదితరులు పాల్గొన్నారు.

చైన్నెలో కొత్తగా మరో 366 టాయిలెట్ల ఏర్పాటు

తిరువొత్తియూరు: చైన్నె కార్పొరేషన్‌ పరిధిలో పబ్లిక్‌ టాయిలెట్లు నిర్మాణం పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రజల సౌకర్యార్థం 954 పబ్లిక్‌ టాయిలెట్లు ఉన్నాయి. ఈ టాయిలెట్లను ప్రజలు ఎలాంటి రుసుము లేకుండానే ఉపయోగిస్తున్నారు. అలాగే ప్రజలకు ఆరోగ్యకరమైన విధంగా ఏర్పాటు చేయడానికి పబ్లిక్‌ టాయిలెట్లను మెరుగుపరిచారు. ఈ క్రమంలో చైన్నె కార్పొరేషన్‌లోని 15 మండలాల పరిధిలో కొత్తగా 366 మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయ్యింది. అలాగే మరో 100 చోట్ల పనులు శరవేగంగా సాగుతున్నాయి.

రోడ్డు ప్రమాదంలో

ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

అన్నానగర్‌: బైక్‌పై విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొనడంతో ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన ఘటన ఆదివారం రాత్రి మధుకరైలో చోటుచేసుకుంది. వివరాలు.. కృష్ణగిరి జిల్లా అవధానపట్టి శివాజీనగర్‌కు చెందిన గాంధీ కుమారుడు ఆదిత్య (18), అదే ప్రాంతానికి చెందిన ముఖేశ్వరన్‌ (19) కోయంబత్తూరు సమీపంలోని ఒత్తక్కాల్‌ మండపంలో ఉన్న ఓ ప్రైవేట్‌ కళాశాలలో చదువుతున్నారు. ఈ క్రమంలో ఆదిత్య, ముఖేశ్వరన్‌ ఆదివారం రాత్రి బైక్‌లో బయటకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ఎల్‌అండ్‌టీ బైపాస్‌ రోడ్డు వద్ద బైక్‌ అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్‌ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆదిత్య, ముఖేశ్వరన్‌ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న మధుకరై పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం కోయంబత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యార్థినుల విజయోత్సాహం

ప్లస్‌–2 ఫలితాలను విడుదల చేస్తున్న మంత్రి అన్బిల్‌ మహేష్‌

సాక్షి, చైన్నె : రాష్ట్రంతో పాటు పుదుచ్చేరిలో ప్లస్‌–2 పబ్లిక్‌ పరీక్షలు మార్చి 13 నుంచి ఏప్రిల్‌ 3వ తేదీ వరకు నిర్వహించారు. ఈ పరీక్షల ఫలితాలను సోమవారం అన్నా శత జయంతి స్మారక గ్రంథాలయం ఆడిటోరియంలో విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేశ్‌ విడుదల చేశారు. ఇందులో 94.03 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు ప్రకటించారు. 8,03,385 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 7,55,451 మంది పాసయ్యారు. ఇందులో 4,21,013 మంది విద్యార్థునులు పరీక్షలు రాయగా 4,05,753 మంది ఉత్తీర్ణులయ్యారు. విద్యార్థినుల్లో 96.38 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే 3,82,379 మంది విద్యార్థులు పరీక్ష రాయగా, 3,49,697 మంది ఉతీర్ణుతులయ్యారు. బాలుర ఉత్తీర్ణత శాతం 91.45గా ఉంది. మొత్తంగా విద్యార్థుల కంటే, విద్యార్థినుల ఉత్తీర్ణత 4.93 శాతం అధికంగా ఉండడం గమనార్హం.

2,767 పాఠశాలల్లో వంద శాతం..

2,767 పాఠశాలకు చెందిన విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 326 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. ఇక పలు సబ్జెక్టుల్లో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల సంఖ్య కూడా అధికంగానే ఉంది. ఉత్తీర్ణతలో 97.85 శాతంతో విరుదు నగర్‌ తొలిస్థానంలోనూ, 97.79 శాతంతో తిరుప్పూర్‌ రెండో స్థానంలోనూ, 97.59 శాతంతో పెరంబలూరు మూడో స్థానంలో నిలిచాయి. ఇక కోయంబత్తూరు కారాగారంలోని ఖైదీలు 12 మంది పరీక్ష రాయగా అందరూ ఉత్తీర్ణులయ్యారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు సీఎం స్టాలిన్‌ శుభాకాంక్షలు తెలియజేశారు.

నేటి నుంచి పునఃమూల్యాంకనానికి

దరఖాస్తుల స్వీకరణ

ప్లస్‌–2లో రీటోటలింగ్‌, రీ వాల్యుయేషన్‌ తదితర ప్రక్రియలకు విద్యార్థులు మంగళవారం నుంచి ఈనెల 13 తేదీ సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకోవచ్చునని మంత్రి అన్భిల్‌ మహేశ్‌ తెలిపారు. అలాగే 10,11 తరగతుల ఫలితాలను ఈనెల 19వ తేదీన ఒకే రోజున విడుదల చేయనున్నామని ప్రకటించారు. కాగా పరీక్ష సమయంలో కడలూరుకు చెందిన విద్యార్దిని తండ్రి జ్ఞాన వేల్‌ మరణించిన విషయం తెలిసిందే. తీవ్ర శోకంతో పరీక్ష రాసిన గిరిజ అనే బాలిక 479 మార్కులు సాధించి ఉత్తీర్ణురాలైంది. దిండుగల్‌కు చెందిన శరవణకుమార్‌, భాను ప్రియల కుమార్తె నందిని 600లకు 600 మార్కులు సాఽధించి రికార్డు సృష్టించింది. ఈ బాలికే తొలి స్థానంలో నిలిచింది. ఇక, తమిళ మాధ్యమంలో నందినితో పాటుగా అరక్కోణానికి చెందిన లక్షయ శ్రీ వందకు వంద మార్కులు దక్కించుకుంది. నామక్కల్‌ పళ్లి పాలయానికి చెందిన హిజ్రా శ్రీయ 337 మార్కులతో ఉత్తీర్ణత సాధించింది.

విద్యార్థి బలవన్మరణం..

పరీక్షల్లో తప్పిన ఓ విద్యార్థి సోమవారం బలన్మరణానికి పాల్పడ్డాడు. చైన్నె శివారులోని ఆవడి గోవర్థన గిరికి చెందిన కనకరాజ్‌ కుమారుడు దేవా(17) పరీక్షస్సో తమిళం, కంప్యూటర్‌ అప్లికేషన్‌ సబ్జెక్టుల్లో ఫెయిల్‌ అయ్యాడు. తీవ్ర మనస్తాపానికి లోనైన దేవా ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫెయిల్‌ అయినందుకు బాధ పడొద్దని, మరోసారి పరీక్ష రాయవచ్చని తండ్రి కనకరాజ్‌ సూచించినా, దేవా ఆత్మహత్యకు పాల్పడడం ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది.

ఫలితాలకు భయపడి..

వేలూరు: తిరువణ్ణామలై జిల్లా తండ్రాంబట్టు తాలుకా నారాయణకుప్పం గ్రామానికి చెందిన రాజామణి కూలీ కార్మికుడు. కొన్ని నెలల క్రితం ఇతని భార్య మృతి చెందింది. ఇతని కుమారుడు హరి(18)తండ్రాంబట్టు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఇటీవల ప్లస్‌–2 పరీక్షలు రాసి ఫలితాల కోసం వేచి ఉన్నాడు. సోమవారం ఉదయం ఫలితాలు విడుదల అయ్యాయి. అయితే పరీక్షలు సక్రమంగా రాయలేదని మనో వేదనతో ఇంట్లో ఎవరూ లేని విషయాన్ని గమనించి ఇంటిలోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యవసాయ బావి వద్దకు వెళ్లి ఇంటికి వచ్చిన తండ్రి రాజామణి కుమారుడి మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరయ్యాడు. విషయం తెలుసుకున్న తండ్రాంబట్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కమలం వైపు చూపు..?

రవీంద్రనాథ్‌

రూ.57 కోట్ల నిధుల కేటాయింపు 383 మంది సిబ్బంది నియామకం

వేలూరు: వేలూరు జిల్లాలో 7,248 మంది బాలురు, 8,098 మంది బాలికలు సహా మొత్తం 15,346 మంది విద్యార్థులు ప్లస్‌–2 పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో మొత్తం 13,689 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. దీంతో వేలూరు జిల్లాలో 89.2 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వేలూరు సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు మొత్తం ఆరుగురు కూడా ఈ పరీక్షలు రాశారు. వీరిలో ముగ్గురు ఉత్తీర్ణ సాధించారు. అలాగే తిరువణ్ణామలై జిల్లాలో 27,865 మంది పరీక్షలకు హాజరు కాగా వీరిలో 25,022 మంది ఉత్తీర్ణత సాధించడంతో 89.8 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఇక రాణిపేట జిల్లాలో మొత్తం 116 పాఠశాలల నుంచి మొత్తం 13,314 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 11,622 మంది ఉత్తీర్ణత సాధించారు. దీంతో ఆ జిల్లాలో 87.3 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అలాగే తిరుపత్తూరు జిల్లాలో 91.13 శాతం మంది పాస్‌ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా ఉత్తీర్ణత శాతాన్ని చూస్తే రాణిపేట జిల్లా ఆఖరి స్థానంలో నిలిచింది. తిరువణ్ణామలై జిల్లా 35వ స్థానంలో నిలవగా తిరుపత్తూరు జిల్లా 29వ స్థానంలో నిలిచింది.

ఉత్తీర్ణత సాధించిన ఆనందంలో..
1/2

ఉత్తీర్ణత సాధించిన ఆనందంలో..

విద్యార్థినిని అభినందిస్తున్న అధ్యాపకురాలు
2/2

విద్యార్థినిని అభినందిస్తున్న అధ్యాపకురాలు

Advertisement

తప్పక చదవండి

Advertisement