కరుణకు నివాళి | Sakshi
Sakshi News home page

కరుణకు నివాళి

Published Sun, Jun 4 2023 1:50 AM

కరుణానిధి చిత్ర పటానికి నివాళి అర్పిస్తున్న స్టాలిన్‌   - Sakshi

సాక్షి, చైన్నె : దివంగత డీఎంకే అధినేత కరుణానిధి జయంతిని పురస్కరించుకుని శనివారం ఆయన విగ్రహాలకు , చిత్ర పటాలకు నాయకులు శనివారం నివాళులర్పించారు. మెరీనా తీరంలోని సమాధి వద్ద సీఎం స్టాలిన్‌ అంజలి ఘటించారు. వివరాలు.. దివంగత డీఎంకే అధినేత, మాజీ సీఎం కరుణానిధి శత జయంతి ఉత్సవాలు శనివారం నుంచి శ్రీకారం చుట్టాల్సి ఉంది. ఏడాది పొడువున వేడుకలకు ఏర్పాట్లు చేశారు. అయితే, ఒడిశా రైలు ప్రమాదం కారణంగా శనివారం జరగాల్సిన అన్ని వేడుకలను రద్దు చేశారు. భారీ బహిరంగ సభతో పాటు వాడవాడలా జయంతి సందర్భంగా సేవలు, సంక్షేమ పథకాల పంపిణీ కార్యక్రమాలన్నీ వాయిదా వేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ నేతృత్వంలో చేపట్ట దలిచిన కార్యక్రమాలను మరో తేదీకి వాయిదా వేసుకున్నారు. అయితే, కరుణకు నివాళులర్పించే విధంగా డీఎంకే వర్గాలు ముందుకు సాగాయి.

సమాధి వద్ద అంజలి

కలైజ్ఞర్‌ కరుణానిధి 100వ జయంతి సందర్భంగా సీఎం స్టాలిన్‌ ఉదయాన్నే ట్వీట్‌ చేశారు. ఆయన సేవలను, జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం మెరీనా తీరంలోని కరుణానిధి సమాధి వద్దకు చేరుకుని పుష్పాంజలి ఘటించారు. మంత్రులు దురై మురుగన్‌, కేఎన్‌ నెహ్రూ, ఏవీ వేలు, పొన్ముడి, ఎంపీ టీఆర్‌ బాలు, రాజ తదితరులు నివాళుర్పించారు. అలాగే పక్కనే ఉన్న అన్నాదురై సమాధి వద్ద కూడా నివాళులర్పించారు. ఓమందూరు ప్రభుత్వ ఆసుపత్రి, డీఎంకే కార్యాలయం ఆవరణలోని అన్నా, కరుణానిధి విగ్రహాలకు పూల మాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా రైలు ప్రమాద మృతులకు నివాళుర్పిస్తూ మౌనం పాటించారు.

ఓమందూరు ఆసుపత్రి వద్ద విగ్రహానికి నివాళులు
1/1

ఓమందూరు ఆసుపత్రి వద్ద విగ్రహానికి నివాళులు

Advertisement
Advertisement