డీఎంకే పంచాయతీ వార్డు మెంబర్‌ హత్య | Sakshi
Sakshi News home page

డీఎంకే పంచాయతీ వార్డు మెంబర్‌ హత్య

Published Thu, Aug 17 2023 1:58 AM

-

కుటుంబానికి రూ. 6 లక్షల పరిహారం

తిరువొత్తియూరు: హత్యకు గురైన డీఎంకే కౌన్సిలర్‌ కుటుంబానికి నష్టపరిహారంగా రూ.6 లక్షలను ప్రభుత్వం అందజేసింది. వివరాలు.. పాళయం కోటైపాళయం కేటీసీ నగర్‌ సమీపంలోని కీళ్లనత్తం వడగూరుకు చెందిన రాజమణి (30) నీళ్లనత్తం పంచాయతీ సభ్యుడిగా పని చేస్తున్నాడు. ఈనెల 13వ తేదీ సాయంత్రం వెల్లిమలై బస్టాఫింగ్‌ వద్ద ముగ్గురు వ్యక్తులు రాజామణిని అడ్డుకుని కత్తులతో దాడి చేసి హత్య చేశారు. పాలై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి కీల్‌నత్తం తెర్కూర్‌కు చెందిన ఇసక్కి పాండి (25) మేలూరుకు చెందిన మాయాండి (28) కీళ్‌నత్తంకు చెందిన మరో మాయాండి (24)ని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో కీళ్లనత్తం ప్రాంతంలో మద్యం తాగుతున్న సమయంలో రాజామణి వారిని ఖండించాడని, దీంతో వారి మధ్య గొడవలు జరిగినట్టు తెలిసింది. ఈ క్రమంలో కీళ్లనత్తం ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో రాజామణి బంధువులు, అతని మృతికి నష్టపరిహారం చెల్లించాలని అతని భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఆందోళన చేపట్టారు. ఆ రాజామణి మృతదేహన్ని తీసుకోవడానికి తిరస్కరించారు. వారితో నెల్‌లై ఎస్పీ సిలంబరసన్‌ మాట్లాడారు. అలాగే నెల్‌లై జిల్లా ఆది ద్రావిడ సంక్షేమ శాఖ అధికారి బెన్నిట్‌ అసీర్‌, పాళయం తహసీల్దార్‌ శరవణన్‌, రెవెన్యూ శాఖ అధికారులు బుధవారం సాయంత్రం వారితో చర్చించి రాజామణి కుటుంబానికి రూ.6 లక్షలు పరిహారం అందజేస్తామని హామీ ఇచ్చారు. అలాగే రాజామణి భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చేస్తామని ప్రకటించారు. దీంతో ఆందోళనకారులు రాజామణి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.

Advertisement
Advertisement