చెట్లను నరికి పట్టాలు ఇవ్వొద్దని నిరసన | Sakshi
Sakshi News home page

చెట్లను నరికి పట్టాలు ఇవ్వొద్దని నిరసన

Published Wed, Aug 23 2023 12:40 AM

కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న లచ్చివాక్కం గ్రామస్తులు   - Sakshi

తిరువళ్లూరు: గ్రామంలోని పచ్చదననాన్ని నాశనం చేసి ఇంటి పట్టాలను మంజూరు చేయవద్దని కోరుతూ గ్రామస్తులు మంగళవారం కలెక్టర్‌ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. వివరాలు.. తిరువళ్లూరు జిల్లా ఎల్లాపురం యూనియన్‌ లచ్చివాక్కం గ్రామంలోని పెరంబూరు, పాంచాలీ తదితర ప్రాంతాలు ఉన్నాయి. ఈ ప్రాంతానికి సమీపంలో సుమారు 5.50 ఎకరాల విస్తీర్ణంలో పచ్చని పొలాలు, మామిడి తోటలు సాగు చేస్తున్నారు.ప్రభుత్వానికి చెందిన ఈ భూమిలోని తోటలు, చెట్లును తొలగించి అదే ప్రాంతంలో ఉన్న అర్హులైన దళితులకు ఇంటి పట్టాలను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే సంబంధిత భూమిని చదును చేయడానికి అధికారులు యత్నించగా స్థానికులు అడ్డుకున్నారు. దీంతో పాటు గ్రామసభలోనూ పచ్చదనాన్ని నాశనం చేసి పట్టాలు ఇవ్వొద్దని తీర్మానం చేశారు. అయినా పట్టించుకోని ప్రభుత్వం పట్టాలను మంజూరు చేయడానికి ప్రయత్నం చేయడంతో స్థానికులు దాదాపు 100 మంది మంగళవారం ఉదయం కలెక్టర్‌ కార్యాలయానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్‌ ఆల్బీజాన్‌వర్గీష్‌కు వినతి పత్రం అందజేశారు. తమ గ్రామంలోని పచ్చదనాన్ని నాశనం చేయవద్దని ఒకవేళ చెట్లును నరికి పట్టాలను ఇవ్వాలనుకుంటే తాము గ్రామాన్ని వదిలివెళ్లిపోవడంతో పాటు ఆధార్‌ రేషన్‌కార్డులను ప్రభుత్వానికి అప్పగిస్తామని తేల్చిచెప్పారు.

Advertisement
Advertisement