మూలకణాల చికిత్సపై అవగాహన పెరగాలి | Sakshi
Sakshi News home page

మూలకణాల చికిత్సపై అవగాహన పెరగాలి

Published Sun, Sep 3 2023 2:02 AM

సమావేశంలో పాల్గొన్న డాక్టర్‌ కామరాజ్‌,
డాక్టర్‌ జయరాణి తదితరులు  - Sakshi

కొరుక్కుపేట: స్టెమ్‌ సెల్‌ చికిత్సపై ప్రజల్లో అవగాహన పెరగాలని డాక్టర్‌ కామరాజ్‌ హాస్పిటల్‌ ఫర్‌ మెన్స్‌ హెల్త్‌ నిర్వాహకులు ,వైద్యులు ప్రొఫెసర్‌ డాక్టర్‌ టి. కామరాజ్‌ తెలిపారు. ఈమేరకు శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ స్టెమ్‌సెల్‌ (మూలకణాలు) థెరఫీ చికిత్స ప్రమాదకర వ్యాధులను నుంచి దూరం చేస్తుందని తెలిపారు. కామరాజ్‌ ఆసుపత్రి నిర్వాహణలో ఉన్న డాక్టర్‌ రాధాకృష్ణన్‌ ఇంటర్నేషనల్‌ ఆర్థోకేర్‌ సెంటల్‌, యునైటెడ్‌ స్టేట్స్‌లో స్టెమ్‌ సెల్‌ థెరఫీ రీసెర్చ్‌లో ప్రసిద్ధి చెందిన జియోస్టార్‌ కంపెనీతో కలసి చైన్నెలో స్టెమ్‌ సెల్‌ థెరఫీ కేంద్రం, స్టెమ్‌సెల్‌ లేబరేటరీని ఈనెల 4న ఏర్పాటు చేయనున్నామని తెలిపారు .ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాండిచ్చేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ హాజరై కేంద్రాన్ని ప్రారంభిస్తారని వెల్లించారు.

Advertisement
Advertisement