‘షార్ట్‌ బూట్‌ త్రీ’కి మేనకా గాంధీ ప్రశంసలు | Sakshi
Sakshi News home page

‘షార్ట్‌ బూట్‌ త్రీ’కి మేనకా గాంధీ ప్రశంసలు

Published Wed, Sep 13 2023 12:20 AM

మేనకాగాంధీతో దర్శకుడు అరుణాచలం వైద్యనాథన్‌  - Sakshi

తమిళసినిమా: యూనివర్స్‌ క్రియేషన్స్‌ పతాకంపై అరుణాచలం వైద్యనాథన్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం షాట్‌ బూట్‌ త్రీ. దర్శకుడు వెంకట్‌ ప్రభు, నటి స్నేహ, యోగిబాబు తదితరులు ప్రధాన పాత్ర పోషించిన ఇందులో నటి శివాంగి, ప్రణీతి, కై లాష్‌ హిట్‌, వేదాంత వసంత్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. సుదర్శన్‌ శ్రీనివాసన్‌ ఛాయాగ్రహణం, వీణా విద్వాంసులు రాజేస్‌ వైద్య సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా బాలల ఇతివృత్తంతో రూపొందిన ఈ చిత్రానికి చిత్ర పరిశ్రమలోని పలువురు ప్రశంసలు అందించారని దర్శకకుడు తెలిపారు. కాగా సామాజిక సేవకురాలు, మూగజీవాల సంరక్షణకు పాటుపడే ప్రముఖ రాజకీయ వేత్త మేనక సంజయ్‌ గాంధీకి ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించినట్లు దర్శకుడు తెలిపారు. చిత్రం చూసిన ఆమె ఇది అన్ని వర్గాల వారు, అన్ని భాషల సినీ అభిమానులు చూడాల్సిన చిత్రమని అభినందించారన్నారు. చిత్రాన్ని థియేటర్స్‌లో విడుదల చేసిన తరువాత ఓటీటీలోనూ విడుదల చేస్తే అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులు చూస్తారని చెప్పారన్నారు. తమ చిత్రాన్ని మేనకా గాంధీ అభినందించడం సంతోషంగా ఉందని దర్శకుడు పేర్కొన్నారు.

Advertisement
Advertisement