కిక్కిరిసిన ప్రయాణం.. | Sakshi
Sakshi News home page

కిక్కిరిసిన ప్రయాణం..

Published Sat, Oct 21 2023 1:42 AM

-

సెలవులు వరుసగా రావడంతో తమ తమ స్వస్థలాలకు వెళ్లి పండుగ జరుపుకునేందుకు సిద్ధమైన వారు శుక్రవారం సాయంత్రం నుంచి బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్ల వైపు కదిలారు. చైన్నె కోయంబేడు, మాధవరం, పెరుంగళత్తూరు, తాంబరం బస్టాండ్‌లు ప్రయాణికులతో కిక్కిరిశాయి. ప్రైవేటు ఆమ్నీ బస్సులలో ముందుగానే రిజర్వు చేసుకుని స్వస్థలాలకు వెళ్లిన వాళ్లు అధికం. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని సాధారణ బస్సులతో పాటు వివిధ ప్రాంతాలకు అదనంగా 1000 బస్సులను రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రోడ్డెక్కించింది. కోయంబత్తూరు, మదురై, తిరునల్వేలి, తిరుచ్చి, సేలం ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు అదనంగా బస్సులను నడిపారు. ఆరు లక్షల మంది స్వస్థలాలకు తరలివెళ్లేందుకు వీలుగా రవాణా సంస్థ, ప్రైవేటు బస్సులు, రైల్వే యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. రిజర్వేషన్ల చేసుకోని వారు అన్‌రిజర్వుడ్‌ బోగీలలో, రద్దీతో కూడిన బస్సులలో తమ గమ్యస్థానానికి పయనం అయ్యారు. అలాగే, చైన్నె నుంచి ఢిల్లీ, ముంబై, విశాఖ పట్నం, కొచ్చిన్‌ నగరాలకు విమానాల సంఖ్యను పెంచారు. విమానాశ్రయంలో సైతం రద్దీ పెరగడం గమనార్హం. ఇదిలాఉండగా, ఆయుధపూజ నిమిత్తం మార్కెట్లలోకి పండ్లు, ఫలాలు, గుమ్మిడికాయలు పెద్ద సంఖ్యలో వచ్చి చేరాయి.

Advertisement
Advertisement