శ్రీరంగంలో కై సిక ఏకాదశి ఉత్సవాలు | Sakshi
Sakshi News home page

శ్రీరంగంలో కై సిక ఏకాదశి ఉత్సవాలు

Published Sat, Nov 25 2023 12:56 AM

-

తిరువొత్తియూరు: శ్రీరంగం రంగనాథ దేవాలయంలో కై సిక ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. భూలోక వైకుంఠం, తిరుచ్చి శ్రీరంగం రంగనాథస్వామి ఆలయం 108 వైష్ణవ ఆలయాలలో మొదటిది. ఇక్కడ సంవత్సరం పొడవునా ఉత్సవాలు జరుగుతుంటాయి. అలా కైసిక ఏకాదశి పండుగ గురువారం ప్రారంభమైంది. ఈ క్రమంలో మొదటి సారి నంపెరుమాళ్‌ మూలస్థానం నుంచి గురువారం ఉదయం చందన మండపం చేరుకున్నారు. అక్కడ తిరుమంజనం నిర్వహించారు. అనంతరం చందనం మండపట్టి నుంచి నంపెరుమాళ్‌ బయల్దేరి 5.45 గంటలకు మూల స్థానానికి చేరుకున్నారు. అదేవిధంగా స్వామి వారు రాత్రి 8.30 గంటలకు మూల స్థానం నుంచి బయలుదేరి 9 గంటలకు అర్జున మండపానికి చేరుకున్నారు. రాత్రి 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు నంపెరుమాళ్‌కు 365 వస్త్రాలు, 365 తాంబూలాలు, 365 కర్పూర సేవతో పాటు పలు ద్రవ్యాలు సమర్పించారు. నంపెరుమాళ్‌కి ఇచ్చిన పట్టు వస్త్రాలు తిరుమల నుంచి వచ్చినవి. రాత్రి 11.30 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల వరకు వైష్ణవ ఆచార్యులు భక్తుడు నంపడువాన్‌ చరిత్రను పఠించారు. శుక్రవారం ఉదయం 5.15 గంటలకు నంపెరుమాళ్‌ అర్జున మండపం నుంచి బయలుదేరి మేళాపాడి మీదుగా 2వ ప్రాకారానికి, ఉదయం 5.45 గంటలకు ఊరేగింపుగా 6 గంటలకు మూలస్థానం చేరుకున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement