మోస్ట్‌ వాంటెడ్‌ రౌడీ అరెస్టు | Sakshi
Sakshi News home page

మోస్ట్‌ వాంటెడ్‌ రౌడీ అరెస్టు

Published Fri, Dec 1 2023 3:10 AM

వెస్ట్‌ మాంబళంలో.. - Sakshi

తిరువొత్తియూరు: అజ్ఞాతంలో ఉన్న మోస్ట్‌ వాంటెడ్‌ రౌడీని పోలీసులు తుపాకీ గురిపెట్టి అరెస్టు చేశారు. వివరాలు.. చైన్నె తాంబరం సమీపం మన్నివాక్కం ఆదనూరు ప్రాంతానికి చెందిన శైలు అనే శైలేందర్‌ (30). ఇతనిపై సేలయూరు పీర్కంకరణై సంకర నగర్‌, గూడువాంచేరి, ఓటేరి, కుండ్రత్తూరు మణిమంగలం తదితర పోలీసుస్టేషన్లో 6 హత్య కేసులు, 30కి పైగా వివిధ నేరాలకు సంబంధించిన కేసులు నమోదై ఉన్నాయి. రౌడీ అయిన అతను నాలుగు సంవత్సరాలుగా అజ్ఞాతంలో ఉన్నాడు. దీంతో ఇతడిని పట్టుకోవడానికి అధికారులు ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం రౌడీ శైలు రాజపాళయంలో దాగి వున్నట్లు ప్రత్యేక బృందం పోలీసులకు సమాచారం అందింది. దీంతో అక్కడికి వెళ్లిన పోలీసులు గురువారం తెల్లవారుజామున 1.30 గంటల సమయంలో తుపాకీ గురి పెట్టి అతన్ని అరెస్టు చేశారు. గురువారం అతనిని కోర్టులో హాజరు పరిచి రహస్య ప్రదేశంలో విచారణ చేస్తున్నట్లు తెలిసింది.

టి.నగర్‌ మార్గంలో వాహనదారుల ఇక్కట్లు
1/2

టి.నగర్‌ మార్గంలో వాహనదారుల ఇక్కట్లు

మైలాపూరు శివసామి రోడ్డులో..
2/2

మైలాపూరు శివసామి రోడ్డులో..

Advertisement
Advertisement