మహిళాభ్యున్నతే లక్ష్యంగా ఒప్పందం | Sakshi
Sakshi News home page

మహిళాభ్యున్నతే లక్ష్యంగా ఒప్పందం

Published Sun, Dec 3 2023 1:42 AM

పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న  మంత్రి పళణి వేల్‌ త్యాగరాజన్‌  - Sakshi

సాక్షి, చైన్నె : మహిళా అభ్యన్నతే లక్ష్యంగా మంత్రి పళణివేల్‌ త్యాగరాజన్‌ సమక్షంలో మ్యాడ్‌ అబౌట్‌ మద్రాసు కార్యక్రమంలో ఎఫ్‌ఐసీసీ ఎఫ్‌ఎల్‌ఓ , ఏఎన్‌ఎన్‌ఈడబ్ల్యూ మధ్య ఒప్పందం జరిగింది. శనివారం స్థానికంగా జరిగిన కార్యక్రమంలో ఆల్‌ ఇండియా ఫోరమ్‌, అసోసియేషన్‌ ఫర్‌ నాన్‌ ట్రెడిషనల్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ఫర్‌ ఉమెన్‌(ఏఎన్‌ఎన్‌ఈడబ్ల్యూ), ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ ప్రతినిధులు ఈ ఒప్పందాలపై సంతకాలు చేశారు. ఈ మేరకు వెనుక బడిన సామాజిక వర్గ మహిళల అభ్యున్నతి, నైపుణ్యాల అభివృద్ధి, విద్యా కార్యక్రమాలు, ప్రాథమిక ఐటీ కార్యక్రమాలు, తదితర అంశాలపై మహిళలు కెరీర్‌ అవకాశాలను మెరుగు పరిచే విధంగా ఈ ఒప్పందాలలో అంశాలను పొందు పరిచారు. కార్యక్రమంలో మంత్రి పళణి వేల్‌ త్యాగరాజన్‌తో పాటు, ఎఫ్‌ఐసీసీ ఎఫ్‌ఎల్‌ఓ, ఏఎన్‌ఎన్‌ఈడబ్ల్యూ ప్రతినిధులు సుధా శివకుమార్‌, రాజీ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 30వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా ఎఫ్‌ఎల్‌ఓ చైన్నె రూపొందించిన ప్రైడ్‌ ఆఫ్‌ ఎఫ్‌ఎల్‌ఓ –30 ఇయర్స్‌ పుస్తకాన్ని మంత్రి ఆవిష్కరించారు.

Advertisement
Advertisement